Aishwarya Rajinikanth : మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌పై ధనుష్‌ ట్వీట్‌.. వైరల్‌..!

March 18, 2022 12:11 PM

Aishwarya Rajinikanth : తమిళ స్టార్‌ సెలబ్రిటీ కపుల్‌ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 18 సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది ఉన్నఫలంగా విడిపోతున్నామంటూ విడాకుల ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Dhanush tweet on Aishwarya Rajinikanth viral
Aishwarya Rajinikanth

ఇలా భార్యాభర్తల బంధం నుంచి విడిపోయిన తర్వాత ఐశ్వర్య తిరిగి తన కెరీర్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య మెగాఫోన్ చేత పట్టి ఓ మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేస్తూ బిజీ అయ్యింది. ఇలా ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నప్పటికీ విడాకులు తీసుకుని విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అదేవిధంగా విడాకుల గురించి ఎక్కడా ప్రస్తావించకుండా భార్య భర్తల బంధం నుంచి విడిపోయి స్నేహితులుగా ఉంటామని తెలియజేశారు.

విడాకుల అనంతరం ఈ జంట స్నేహితులుగా మారి ట్వీట్స్ చేసుకున్నారు. ఇలా వీరిద్దరి లేటేస్ట్ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య రజినీకాంత్.. పయని అనే మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేయగా.. ఈ వీడియోని తమిళ వెర్షన్ లో రజనీకాంత్, తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఇక ఈ వీడియోపై ధనుష్ స్పందిస్తూ.. పయని మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు.. అంటూ ధనుష్ పోస్ట్‌ పెట్టారు.

ఐశ్వర్య ఆయన ట్వీట్ కి స్పందిస్తూ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ విధంగా ఐశ్వర్య, ధనుష్ స్నేహితులుగా మారి ట్వీట్స్ చేసుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే వీరి ట్వీట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. విడాకుల తరువాత మొదటి సారిగా ఇలా సోషల్‌ మీడియా వేదికగా వీరు మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now