కోలీవుడ్‌లో స్టార్ జంటగా ఉన్న ధనుష్ – ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా ? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్ మీడియా ఖాతాల్లో పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక కలిసి కనిపించిన సందర్భాలు లేవు. కాకపోతే తన ఇద్దరు కుమారులను తీసుకొని ధనుష్ ఓసారి ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు.
ఇదిలా ఉంటే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్ ఐశ్వర్య. పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు. ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో.. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.. అంటూ సోమవారం ఓ ఫోటో వదిలింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
అందులో ధనుష్, ఐశ్వర్య.. తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సెలబ్స్ విడిపోయినా కూడా పిల్లల కోసం కొన్ని సందర్భాలలో కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధనుష్- ఐశ్వర్య కలిసి కట్టుగా కనిపించారు. ఇక ధనుష్ తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోపక్క ఐశ్వర్య రజనీకాంత్.. డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతుంది. హిందీలో ఓ సాథీ చల్ అనే ప్రేమకథా చిత్రాన్ని ఆమె డైరెక్ట్ చేస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…