Devi Nagavalli : త‌ప్పు చేశాను.. రెండు రోజులు తిండి మానేసి ఏడుస్తూ కూర్చున్నా : దేవి నాగ‌వ‌ల్లి

May 5, 2022 4:04 PM

Devi Nagavalli : విశ్వ‌క్‌సేన్‌తో గొడ‌వ పెట్టుకోవ‌డం ఏమోగానీ న్యూస్ యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లిని ప్ర‌స్తుతం నెటిజన్లు దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. ఆమెనే త‌ప్పు చేసిందంటూ వారు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు చెందిన కొన్ని పాత వీడియోల‌ను వారు షేర్ చేస్తూ ఆమెను త‌ప్పు ప‌డుతున్నారు. దేవి గ‌తంలో స్వ‌యంగా రోడ్డు మీద డ్యాన్స్ చేసింద‌ని.. ఇప్పుడు వేరే వాళ్లు చేస్తే ఆమె ఎలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తోంది ? ఆమె సో కాల్డ్ జ‌ర్న‌లిస్టు అని చెప్పుకుంటూ.. ఇత‌రుల వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా ఎందుకు మాట్లాడుతోంది ? అంటూ ఆమెనే అంద‌రూ త‌ప్పుబ‌డుతున్నారు.

Devi Nagavalli said sorry old video viral
Devi Nagavalli

ఇక విశ్వ‌క్‌సేన్‌కు సినీ రంగానికి చెందిన వారి నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్ప‌టికే న‌టి క‌రాటే క‌ల్యాణి, క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌, సీనియ‌ర్ న‌టి క‌స్తూరితోపాటు హేతువాది బాబు గోగినేని, ద‌ర్శ‌కులు హ‌రీష్ శంక‌ర్‌, బండి స‌రోజ్ వంటి వారు విశ్వ‌క్ కే మ‌ద్ద‌తు తెలిపారు. హ‌రీష్ శంక‌ర్ అయితే దేవి వీడియోల‌ను వ‌రుస‌గా పోస్ట్ చేస్తున్నారు. అవ‌న్నీ ఆమెపై వ‌స్తున్న ట్రోల్స్ తాలూకు వీడియోలు కావ‌డం విశేషం. అయితే దేవి గ‌తంలో బిగ్ బాస్ 4 లో పాల్గొంది. అప్ప‌ట్లో ఆమెపై ఓ వీడియోను షో ముందు ప్ర‌సారం చేశారు. అందులో ఆమె త‌న జ‌ర్న‌లిస్ట్ లైఫ్ ఎలా ప్రారంభ‌మైందో చెప్పుకొచ్చింది.

తాను సంప్ర‌దాయ కుటుంబంలో పుట్టాన‌ని దేవి ఆ వీడియోలో చెప్పింది. త‌మ ఇంట్లో మ‌హిళ‌లు ఉద్యోగాలు చేయ‌డం అంటే చాలా క‌ష్ట‌మ‌ని.. క‌నుక ఇంట్లో అబ‌ద్ధం చెప్పి హైద‌రాబాద్ కు వ‌చ్చాన‌ని.. త‌రువాత టీవీ 9లో రెజ్యూమ్ ఇచ్చి ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యాన‌ని.. అలా అక్క‌డ సెలెక్ట్ అయి న్యూస్ యాంక‌ర్ అయ్యాన‌ని తెలిపింది.

https://www.facebook.com/watch/?v=623999938478097

ఇక త‌న కెరీర్‌లో ఒక స‌మ‌యంలో ఒక వార్త విష‌యంలో త‌ప్పు చేశాన‌ని ఆమె తెలిపింది. ఒక యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయింద‌ని చెప్పి ఆమె కుటుంబంపై స్టోరీ చేశాన‌ని.. కానీ ఆమెను ఆమె తండ్రే చంపాడ‌ని.. త‌న‌కు ఈ విష‌యం తెలియ‌కుండా స్టోరీ చేశానని.. ఈ విష‌యంలో త‌ప్పు చేశాన‌ని.. అప్పుడు ఎంతో బాధ ప‌డ్డాన‌ని చెప్పింది. ఆ స‌మ‌యంలో రెండు రోజుల పాటు తిండి తిప్ప‌లు మానేసి ఏడుస్తూ అలా కూర్చుని ఉండిపోయాన‌ని చెప్పింది. అయితే ఈ పాత వీడియోను కొంద‌రు మ‌ళ్లీ వైర‌ల్ చేస్తూ.. దేవిని ట్రోల్ చేస్తున్నారు. ఆమెను విమ‌ర్శిస్తున్నారు. మ‌రి వీట‌న్నింటికీ ఆమె స‌మాధానం చెబుతుందా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now