Whatsapp : వాట్సాప్‌పై సైబ‌ర్ అటాక్ ? చైనా హ్యాక‌ర్ల దాడి వ‌ల్లే సేవ‌ల‌కు అంత‌రాయం ?

October 4, 2021 11:19 PM

Whatsapp : వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ తోపాటు వాటి మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ సేవ‌లు 2 గంట‌లుగా నిలిచిపోయాయి. ఉన్న ప‌ళంగా ఈ మూడు నెట్‌వ‌ర్క్ ల‌కు చెందిన సేవ‌లు నిలిచిపోవ‌డంతో ఏం జ‌రుగుతుందో తెలియక యూజ‌ర్లు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. కొంద‌రు త‌మ ఇంట‌ర్నెట్ ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుందేమోన‌ని భావిస్తుండ‌గా.. కొంద‌రికి మాత్రం ఫేస్‌బుక్ కార్య‌క‌లాపాలు పూర్తిగా నిలిచిపోయిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

Whatsapp : వాట్సాప్‌పై సైబ‌ర్ అటాక్ ? చైనా హ్యాక‌ర్ల దాడి వ‌ల్లే సేవ‌ల‌కు అంత‌రాయం ?

అయితే సాధార‌ణంగా ఇంతటి పెద్ద నెట్‌వ‌ర్క్ ల‌కు చెందిన సైట్లు 1 లేదా 2 నిమిషాల పాటు డౌన్ అవ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 2 గంట‌ల నుంచి ఈ మూడు నెట్‌వ‌ర్క్ లు ప‌నిచేయ‌డం లేదు. దీన్ని బ‌ట్టి చూస్తే వాట్సాప్‌పై సైబ‌ర్ దాడి జ‌రిగింద‌ని, అందుక‌నే ఈ మూడు నెట్‌వ‌ర్క్‌ల‌కు చెందిన సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

అయితే వాట్సాప్‌పై చైనాకు చెందిన హ్యాక‌ర్లు దాడి చేసి ఉండ‌వ‌చ్చ‌ని అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. మ‌రో వైపు దీనిపై ఫేస్‌బుక్ క‌చ్చితంగా చెప్ప‌డం లేదు. సాంకేతిక స‌మ‌స్య వ‌చ్చింద‌ని, సరిచేస్తున్నామ‌ని మాత్రం ఫేస్‌బుక్ చెబుతోంది. మ‌రి ఈ స‌మ‌స్య ఎప్ప‌టికి ప‌రిష్కారం అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now