Bigg Boss : బుల్లితెరపై బిగ్ బాస్ హంగామా మొదలైంది. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. ఇందులో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అలకలు, ఉరుకులు, పరుగులు, టాస్క్‌లు, లవ్‌లు, ఎఫైర్లు, బ్రేకప్ అబ్బో ఒక్కటేమిటి కాదేదీ గొడవకు అనర్హం అన్నట్టుగా కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్‌లు పెడుడూ ఉంటాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ తో పాటు కింగ్ నాగార్జున కూడా విమర్షలు ఫేస్ చేయాల్సి వస్తోంది. బిగ్ బాస్ ను ఘోరంగా విమర్షిస్తున్న వారిలో సీపీఐ సీనియర్ లీడర్ నారాయణ ఒకరు.
అది బిగ్ బాస్ హౌస్ కాదని.. బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా.. నాగార్జున లాంటి వ్యక్తి ఇలాంటి ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించడం ఏంటి.. డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదంటూ నాగార్జునపై నారాయణ విమర్శలు చేశాడు. దీనికి నాగార్జున నేరుగా కౌంటర్ ఇవ్వడం చూశాం. ఇటీవల నల్గొండలో ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. దీనిని నారాయణ తీవ్రంగా ఖండించారు. వాళ్ళు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించాం అని అంటున్నారు.
బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులు అయితే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కూడా అంతే. మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సభ్యులకి కూడా గుండు కొట్టించండి అని నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. నారాయణ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై నారాయణ వ్యాఖ్యలు వివాదం అవుతున్నాయి. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూశాం. అనంతరం క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…