Bigg Boss : బిగ్ బాస్ లో ఉన్న వాళ్లందరికీ గుండు కొట్టించండి.. నారాయణ మ‌ళ్లీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..

September 22, 2022 6:00 PM

Bigg Boss : బుల్లితెరపై బిగ్ బాస్ హంగామా మొదలైంది. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. ఇందులో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అలకలు, ఉరుకులు, పరుగులు, టాస్క్‌లు, లవ్‌లు, ఎఫైర్లు, బ్రేకప్ అబ్బో ఒక్కటేమిటి కాదేదీ గొడవకు అనర్హం అన్నట్టుగా కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్‌లు పెడుడూ ఉంటాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ తో పాటు కింగ్ నాగార్జున కూడా విమర్షలు ఫేస్ చేయాల్సి వస్తోంది. బిగ్ బాస్ ను ఘోరంగా విమర్షిస్తున్న వారిలో సీపీఐ సీనియర్ లీడర్ నారాయణ ఒకరు.

అది బిగ్ బాస్ హౌస్ కాదని.. బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా.. నాగార్జున లాంటి వ్యక్తి ఇలాంటి ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించడం ఏంటి.. డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదంటూ నాగార్జునపై నారాయణ విమర్శలు చేశాడు. దీనికి నాగార్జున నేరుగా కౌంటర్ ఇవ్వడం చూశాం. ఇటీవల నల్గొండలో ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. దీనిని నారాయణ తీవ్రంగా ఖండించారు. వాళ్ళు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించాం అని అంటున్నారు.

cpi narayana again controversial comments on Bigg Boss
Bigg Boss

బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులు అయితే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కూడా అంతే. మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సభ్యులకి కూడా గుండు కొట్టించండి అని నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. నారాయణ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై నారాయణ వ్యాఖ్యలు వివాదం అవుతున్నాయి. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూశాం. అనంతరం క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now