Conductor Jhansi : పల్సర్ బండి ఝాన్సీకి బంపర్ ఆఫర్.. రెమ్యూనరేషన్‌ ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

October 3, 2022 10:15 PM

Conductor Jhansi : గాజువాకకి చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది. ఉద్యోగరీత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి డాన్స్ అంటే ప్రాణమట. ఆ ఇష్టంతోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఝాన్సీ. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఝాన్సీ చేసిన డాన్స్‌ పర్ఫార్మెమెన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరికొందరు ఆమెకు ఏకంగా అభిమానులైపోయారు. ఆమె ఎక్స్‌ ప్రెషన్స్, గ్రేస్‌, డాన్స్‌ మూమెంట్స్‌ ఏరేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఝాన్సీకి బంపర్ ఆఫర్ వచ్చింది.

జబర్దస్త్ లో వరుసగా బుల్లెట్ భాస్కర్ టీం లో కనిపిస్తున్న ఝాన్సీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవ్వబోతుందంటూ ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఇటీవలే ఝాన్సీకి సంపూర్ణేష్ బాబు ఆఫర్ ఇచ్చాడంటూ ప్రచారం జరిగింది. ఆయన తన సినిమాలో ఐటమ్ సాంగ్ ని ఝాన్సీతో చేయించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ హీరో సినిమాలో ఫుల్ లెంగ్త్‌ పాత్రలో ఆమెకు అవకాశం దక్కిందట.. అందుకుగాను ఆమె 40 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉందట. నిర్మాతలు ఆమెకు 20 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడంతోపాటు 5, 6 లక్షల రూపాయల అదనపు చార్జీలు ఇవ్వనున్నారట.

Conductor Jhansi got big offer her remuneration will surprise you
Conductor Jhansi

ఆమె ఇప్పటికీ జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూనే స్టేజి షోలతో కూడా ఆకట్టుకుంటుంది. మరో వైపు కండక్టర్ ఉద్యోగం కూడా చేస్తుంది. ఝాన్సీ సినిమాలో సక్సెస్ అయితే వెనుతిరిగి చూసుకోనవసరం లేదని సినీ వర్గాల టాక్. సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా కూడా ఈటీవీలో కార్యక్రమాలను వదిలి పెట్టేది లేదంటూ ఇటీవల సన్నిహితుల వద్ద ఝాన్సీ చెప్పుకొచ్చిందట. ప్రస్తుతానికి కండక్టర్ జాబ్ కి లాంగ్ లీవ్ లో ఉన్న ఝాన్సీ త్వరలోనే ఆ జాబ్ కి రిజైన్ చేసినా ఆశ్చర్యం లేదు. డాన్స్ తో ఇరగదీసిన ఝాన్సీ సినిమాల్లో ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now