Ameesha Patel : ఓ వైపు అందాల ఆర‌బోత‌.. మ‌రోవైపు చీటింగ్ కేసు..!

April 26, 2022 11:22 PM

Ameesha Patel : తెలుగు, హిందీ చిత్రాల్లో తనదైన నటనా శైలితో అలరించిన అమీషా పటేల్ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించింది. మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన అమీషా పటేల్ తన తండ్రి స్నేహితుడు రాకేష్ రోషన్ సహకారంతో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టింది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని స్టార్ హీరోయిన్‌గా మారింది అమీషా పటేల్. బద్రి, నాని సినిమాలతో తెలుగువారికి పరిచయమైంది ఈ హీరోయిన్‌. క‌హోనా ప్యార్ హై చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలోనూ న‌టించి అలరించింది. ఇప్ప‌టికీ ఈ అమ్మ‌డు త‌న న‌ట‌న‌తోపాటు అందాల‌తో ఆక‌ర్షిస్తోంది.

complaint filed on Ameesha Patel for cheating
Ameesha Patel

పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి లో పవన్ కళ్యాణ్ కు జంటగా నటించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు, ప్రధానంగా యూత్ కు ఎంతగా నచ్చిందో తెలిసిన విషయమే. బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ మూవీల్లో నటించి మెప్పింది. వాటిలో గదర్ : ఎక్ ప్రేమ్ కథ, హమ్రాజ్, సునో ససుర్జీ, మంగళ్ పాండే, హమ్ కో తుమ్సే ప్యార్ హై, రేస్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గద‌ర్‌ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న అమీషా ఢిల్లీలో ఎంజాయ్‌ చేస్తోంది. ఓ చెట్టు కింద బికినీ ధరించి నిల్చున్న ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే ఆమె ఓ వైపు అలా అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుండ‌గా.. ఆమె మీద చీటింగ్ కేసు న‌మోదు కావ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం నిర్వాహకులు అమీషా పటేల్‌ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమె రూ.4 లక్షలు వసూలు చేసింది. తీరా ప్రోగ్రామ్‌కు వచ్చిన తర్వాత కేవలం మూడు నిమిషాలే స్టేజీపై కనిపించి జంప్ అయింది. ఈ క్ర‌మంలో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అమీషా ట్విటర్‌ వేదికగా స్పందించింది. ఏప్రిల్‌ 23వ తేదీన‌ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు హాజరయ్యాను. స్టార్‌ ఫ్లాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్, అరవింద్‌ పాండే కార్య‌క్ర‌మాన్ని స‌రిగా నిర్వ‌హించ‌లేదు. నాకు ప్రాణ భ‌యం ప‌ట్టుకుంది. స్థానిక పోలీసుల స‌హాయంతో భ‌య‌ట‌ప‌డ్డాను అని అమీషా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. అయితే తీసుకున్న డ‌బ్బును వెన‌క్కి ఇస్తాన‌ని మాత్రం చెప్ప‌లేదు. అందువ‌ల్లే ఆమెపై చీటింగ్ కేసు పెట్టార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment