Chiranjeevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను తనదైన నటన, డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎంతటి స్టార్ హీరో అయినా కెరీర్ లో ఫ్లాప్ లు తప్పవు.
మెగాస్టార్ లో కెరీర్ లో కూడా ఫ్లాప్ లు ఉన్నాయి. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన అంజి సినిమా మాత్రం మెగాస్టార్ ను తీవ్ర నిరాశ పరిచింది. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. 1997 లోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అప్పటి నుండి మీడియాలో అంజి సినిమా వార్తలు తరచూ కనిపించేవి. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి మాత్రం 7 ఏళ్ళు పట్టింది.
అప్పట్లోనే రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 2004 లో విడుదల అయ్యింది. సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ ను ఉపయోగించారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారట. ఆ తరవాత అరుంధతి సినిమాతో కోలుకున్నారట. అయితే ఈ సినిమాలో మాసిన షర్ట్ తో కనిపించడానికి చిరంజీవి ఒకే షర్ట్ ను ఏకంగా రెండేళ్ల పాటు ఉతక్కుండా వేసుకున్నారట.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…