Chiranjeevi Website : మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం. ఆయన స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఆయన స్పూర్తితోనే ఎదిగారు. ఇప్పుడు చిరంజీవి గొప్పతనాన్ని నలుగురికి తెలియజేసేందుకు రామ్ చరణ్ నడుం బిగించారు. సోమవారం చిరంజీవి సినీ, వ్యక్తిగత జీవితవిశేషాలతో కూడిన www.kchiranjeevi.com అనే వెబ్‌సైట్‌ను రామ్‌చరణ్ ప్రారంభించారు. దీనితోపాటుగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్త్రతం చేస్తూ www.chiranjeevicharitabletrust.com అనే వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు.
రామ్ చరణ్ ప్రకటించిన వెంటనే వెబ్‌సైట్‌లో ఇన్‌ఫర్మేషన్ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. అయితే అందులో దొర్లుతున్న తప్పులు ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తున్నాయి. ఇంగ్లిష్ నుంచి ఇతర భాషల్లోకి టాన్సలేట్ చేసేందుకు ఆప్షన్ క్లిక్ చేయగానే అందులో ఉన్న సమాచారం మొత్తం అర్థరహితంగా డిస్‌ప్లే అవుతుంది. తెలుగులోనే ఇలా ఉంటే ఇతర భాషల పరిస్థితి ఏంటి ? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సోమవారం ప్రెస్‌మీట్‌కి హాజరైన రామ్ చరణ్ తన వ్యక్తిత్వంతో అందరి మనసులు గెలుచుకున్నాడు. సెల్ఫీలు దిగకూడదని నిర్వాహకులు కాస్త హడావుడి చేసినా చరణ్ చొరవ తీసుకుని వాళ్లతో కలిసి ఫోటోలు దిగడంపై ఆసక్తి కనబరిచారు. మీడియా మిత్రులందర్నీ అన్నదమ్ముల్లా ట్రీట్ చేశారు. మిత్రులతో చరణ్ ఫోటోలు దిగి ఆశ్చర్యపరిచారు. అడిగిన వారికి సెల్ఫీలు సైతం ఇచ్చారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…