Chiranjeevi : మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని దర్శకనిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిరంజీవి రేంజ్ కు తగ్గట్లు ఉంది. గాడ్ ఫాదర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మెగాభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మూడో రోజు వరల్డ్ వైడ్‌గా గాడ్ ఫాదర్ సినిమా రూ.7.01 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. మొత్తం మూడు రోజులకు కలిపి రూ.34.36 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. గ్రాస్ పరంగా చూస్తే రూ.62.55 కోట్లు రాబట్టుకుంది అంటూ సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
గాడ్ ఫాదర్ మూవీ విజయాన్ని అందుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమాపై సురేఖా ఏమన్నారని చిరంజీవిని యాంకర్ సుమ ప్రశ్నించింది. నా కంటే ఎక్కువగా సురేఖ టెన్షన్ పడింది. నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్న కూడా రిలీజ్‌కు సాయంత్రం నుంచి సురేఖ చాలా డల్‌గా ఉంది. ఆ సమయంలో సురేఖను చూసి నేను కాస్త డల్ అయ్యానని చిరంజీవి చెప్పడం జరిగింది. ఈ సినిమాపై నేను ఎంతో నమ్మకంగా ఉన్నా, గతంలో హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు ఆడకపోవడంతో ఏమో ఏమవుతోందని సురేఖలో భయం ఏర్పడింది. తన భయం చూసి నేను కూడా భయపడాల్సి వచ్చింది అంటూ చిరంజీవి సుమ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు.
ఆ రోజు రాత్రి నేను సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని అస్సలు నిద్రపోలేకపోయాను. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ తో వణికిపోయాను. సినిమా విడుదలైన రోజు ప్రసాద్ లండన్ నుంచి ఫస్ట్ కాల్ చేసి సినిమా బాగుందని చెప్పారు. ఆ తరువాత వరుసగా కాల్స్ రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి సినిమా కూడా ప్రాణం పెట్టి తీస్తాం. కానీ ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయన్నది కాదు.. ఎంతమంది ప్రేక్షకులకు సినిమా నచ్చింది అన్నదే ముఖ్యం అంటూ చిరంజీవి సక్సెస్ మీట్ లో వెల్లడించారు.
గాడ్ ఫాదర్ సినిమా ఇంద్ర, ఠాగూర్ ఆ రేంజ్ సినిమాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాను బ్లాక్‌బస్టర్ అని చెబుతున్నారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని బింబిసార, కార్తికేయ 2, సీతారామం సినిమాలు నిరూపించాయి. మేము కూడా అదే నమ్మకంతో ఈ సినిమా కోసం కృషి చేశాం. ఈ సినిమా కోసం ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేర్లను ముందుగా పరిశీలించాం. చివరికి రామ్ చరణ్, ప్రసాద్ డైరెక్టర్ మోహన్ రాజా పేరును సూచించడం జరిగింది. ఆ తరువాత టీమ్ అంతా కూర్చొని సెట్ చేశారంటూ చిరంజీవి సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…