Chiranjeevi : ప్ర‌కాష్ రాజ్ ఓడిపోతార‌ని మెగాస్టార్ చిరంజీవికి ముందే తెలుసా ?

Chiranjeevi : గ‌త కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల ప్రచారంలో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్ స‌భ్యులు హోరా హోరీగా ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి మా ఎన్నిక‌ల‌కు విప‌రీత‌మైన హైప్ వ‌చ్చింది. దీంతో ప్ర‌కాష్ రాజ్‌, ఆయ‌న ప్యానెల్ స‌భ్యులు, మ‌ద్ద‌తుదారులు కాస్తంత హ‌ద్దులు దాటార‌నే చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ మంచు విష్ణు మాత్రం అన్నింటికీ కౌంట‌ర్ ఇస్తూ కూల్‌గా ముందుకు సాగాడు.

అయితే మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ఓడిపోతార‌ని చిరంజీవికి ముందే తెలుస‌ని.. ఓవార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అందుకు ఆయ‌న పెళ్లిసంద‌డి ప్రీ రిలీజ్ వేడుక‌లో చేసిన వ్యాఖ్య‌లే కార‌ణం. అప్ప‌టికి ఇంకా ఫ‌లితాలు రాలేదు. అయినా ఆయ‌న ఎన్నిక‌ల త‌రువాత ఎవ‌రు గెలిచినా, ఎవ‌రు ఓడినా.. అంద‌రం క‌లిసే ఉండాలని, ఇవి చిన్న ఎన్నిక‌ల‌ని, అన‌వ‌స‌రంగా గొడ‌వ‌లు ప‌డి మా ప‌రువు తీయొద్ద‌ని అన్నారు. అయితే ప్ర‌కాష్ రాజ్ ఓడిపోతార‌ని మెగాస్టార్ ముందే ఊహించారా ? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

ఇక ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌కు కేవ‌లం నాగ‌బాబు మాత్ర‌మే మ‌ద్ద‌తుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రూ ప్ర‌చారంలో పాల్గొన‌లేదు. అల్లు అర్జున్ అయితే పోలింగ్ కు దూరంగా ఉన్నారు. అంటే.. ప్ర‌కాష్ రాజ్ ఓడిపోబోతున్నార‌ని.. అప్పుడే వారికి అర్థ‌మై ఉంటుంద‌ని, అందుక‌ని అన‌వ‌స‌రంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చి అభాసు పాలు కావ‌డం ఎందుక‌ని.. అప్పుడే వారు ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఒక వేళ ప్ర‌కాష్ రాజ్‌కు మ‌ద్ద‌తు ఇచ్చి ఉంటే ఆయ‌న ఎలాగూ ఓడిపోతారు క‌నుక‌.. మంచు విష్ణు ఫ్యామిలీతో స్నేహం పోతుంది. వారికి వైసీపీ ప్ర‌భుత్వంతో సాన్నిహిత్యం ఉంది క‌నుక ప్ర‌కాష్ రాజ్‌కు మ‌ద్ద‌తు ఇచ్చి భంగ‌ప‌డ‌డం ఎందుక‌ని.. ముందుగానే ఊహించిన మెగాస్టార్ ఈ ఎన్నిక‌ల‌కు ఆయ‌న మాత్ర‌మే కాకుండా, త‌న ఫ్యామిలీని కూడా దూరంగా ఉంచారు. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్పుడు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM