Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి దేశ వ్యాప్తంగా ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వయస్సులోనూ కుర్ర హీరోలకు పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతోనూ చిరు ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలందించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.
క్రైసిస్ సమయంలో అభిమానులు ముందుకొస్తారా ? అనుకుంటే నా పిలుపు విని మీరంతా అండగా నిలవడం ఎనలేని ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అనుకున్నదే ఆలస్యం.. వారంలోనే ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించానంటే ఆ క్రెడిబిలిటీ అభిమానులదే. దుబాయ్.. గుజరాత్.. వైజాగ్ లాంటి చోట్ల ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఆక్సిజన్ యంత్రాల్ని తయారు చేయించాం. 3000కు పైగా సిలిండర్లు తయారు చేయించాం. కానీ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నాం. చాలా శ్రమించాం.. అని తెలిపారు చిరంజీవి.
అయితే చిరంజీవి తన అభిమానులతో మీటింగ్‌కి వచ్చిన సమయంలో చేతికి కట్టుతో కనిపించారు. చిరు చేతికి ఉన్న కట్టు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైందని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఈ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారా.. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…