Childhood Photo : ముద్దు ముద్దుగా ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టేశారా..?

September 14, 2022 7:21 PM

Childhood Photo : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి చిన్నది ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్. చూడడానికి అచ్చతెలుగమ్మాయిలా కనిపిస్తుంది. కానీ మళ‌యాళీకి చెందిన ముద్దుగుమ్మ. ఈమె తండ్రి యాక్టర్ మరియు ప్రొడ్యూసర్. అంతేకాదు ఈమె తల్లి  తెలుగులో చిరంజీవితో పున్నమినాగు సినిమాలో నటించింది. తెలుగులో అవకాశాలు రాకపోవడం వల్ల దక్షిణాదిలో వేరే భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా  స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మళ‌యాళం అనే తేడా లేకుండా చిత్రాలు చేస్తూ మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత హీరో హీరోయిన్స్ తమ త్రో బ్యాక్ పిక్చర్స్ తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ పోస్ట్ చేసిన తన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల మహేష్ బాబుతో నటించి తన గ్లామర్ తో కుర్రకారు మతులు పోగొట్టేసింది. ఇంతకీ ఎవరు ఈ హీరోయిన్ అని ఆలోచిస్తున్నారా.. ఆమె ఇంకెవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్.

Childhood Photo of keerthy suresh goes viral
Childhood Photo

ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవం పోసింది కీర్తి సురేష్. మహానటి చిత్రానికి గాను నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత కీర్తి నటించిన మన్మథుడు 2, గుడ్ లక్ సఖి, రంగ్ దే చిత్రాలు ఆశించిన మేరకు విజయాలు సాధించలేకపోయాయి. ఇటీవల మహేష్ బాబు తో నటించిన సర్కారు వారి పాట చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటూ తన లేటెస్ట్ గ్లామరస్ లుక్ తో ఉన్న ఫోటోల‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ చూసేవారికి కనుల విందు చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now