Charmy Kaur : ఊరుకో చార్మి ఊరుకో.. సినిమా ఫ్లాప్ అయితే నువ్వైనా ఏం చేస్తావ్..?

August 26, 2022 10:25 PM

Charmy Kaur : నో రోర్, ఓన్లీ బోర్ అంటూ లైగర్ చిత్రంపై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు నెటిజన్ల‌ నుంచి వస్తున్నాయి.  ఎన్నో భారీ అంచనాలతో లైగర్ చిత్రం ఈనెల ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో భారీ అంచనాలతో వచ్చినా కూడా ఈ చిత్రం ఫ‌స్ట్ షో నుంచే ఘోర‌మైన డిజాస్ట‌ర్ టాక్ ను అందుకుంది. సినిమా అసలు ఏమాత్రం బాగోలేదు అంటూ ప్రేక్షకుల నుండి నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్‌ మినహా చిత్రం వారంలోపే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ప్రేక్షకుల  నుంచి టాక్ వినిపిస్తోంది.

మొదటి రోజునే రూ.200 కోట్లు వసూలు చేస్తుందని సినిమా యూనిట్ చేసిన ప్రచారం కేవలం కలగానే మిగిలిపోయింది. లైగర్ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇంత డిజాస్టర్ టాక్ తో దారుణ‌మైన నెగెటివ్ కామెంట్స్ తో సోష‌ల్ మీడియాలో పూరీని ఏకేస్తున్నారు. పూరీకి త‌న‌కు తాను ఏదో పెద్ద తోపు అనే న‌మ్మ‌కం బాగా ఎక్కువైపోయింది. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద పెద్ద స్టార్ల సినిమాలే బాక్సాఫీస్ వద్ద బోర్లాపడుతున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ కథను జోడించడమే కాకుండా నత్తి సుత్తి అంటూ చెత్త చెత్త చేశాడు పూరీ అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.

Charmy Kaur cried for Liger movie flop talk
Charmy Kaur

ఓవర్ గా ప్రమోషన్స్ చేస్తూ ఛార్మి ఎందుకు ఏడ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. కనీసం నేను పెట్టిన పెట్టుబడి నాకు తిరిగి వస్తుందా.. అని భోరుమని ఏడ్చి ఉంటుంది. క‌నీసం కథ రాసే విధానంలో శ్ర‌ద్ధ కూడా పెట్టలేకపోతున్నావా పూరీఅంటున్నారు. మైక్ టైసన్ వంటి గొప్ప ప్రముఖుడు చిత్రంలో నటించినప్పుడు సినిమా ఏ రేంజ్ లో ఉండాలో కూడా నీకు అర్థం కావడం లేదా.. ఫైనల్ గా స్టోరీ మొత్తం చెత్త చెత్త చేశావంటూ నెటిజన్లు  విమర్శిస్తున్నారు. ఎంతసేపూ ఛార్మి ధ్యాసలోనే బతికితే, నేను కొన్నాళ్లకు డైరెక్టర్ అనే విషయాన్ని జనాలు మర్చిపోతారు.. అంటూ పూరీ జగన్నాథ్ ని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ ఏకిపారేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment