Charmme Kaur : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న చార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా చెలామణీలో ఉన్న ఛార్మి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే హీరోయిన్ గా సినిమాల్లో నటించకపోయినా నిర్మాతగా బాధ్యతలను చేపట్టి పలు చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛార్మి, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా “రొమాంటిక్” చిత్రాన్ని నిర్మించారు.
అక్టోబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఛార్మి మాట్లాడుతూ.. తన గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను హీరోయిన్ గా ఉన్నప్పుడు కేవలం తన శరీర ఫిట్ నెస్ పై మాత్రమే దృష్టి పెట్టేదాన్నని, అప్పుడు ఎంతో ప్రశాంతంగా తన జీవితం ఉండేదని తెలిపారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నిర్మాతగా ప్రతి చిన్న విషయాన్ని చూసుకోవలసి ఉంటుందని, నిర్మాతగా మారిన తర్వాత తాను గాడిద కష్టం చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే తనకు ఇప్పటికే సినిమా అవకాశాలు వస్తున్నాయని, కష్టమైనా తనకు నిర్మాణ రంగంలోనే ఎంతో బాగుందని.. ఇకపై సినిమాల్లో నటించనని ఛార్మి తెలియజేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…