Cat : య‌జ‌మాని చనిపోయిన బాధ నుంచి ఇంకా బ‌య‌ట ప‌డ‌ని పిల్లి.. అత‌ను వ‌స్తాడ‌ని రోజూ స‌మాధి వ‌ద్ద కూర్చుంటోంది..

January 15, 2022 6:44 PM

Cat : పెంపుడు జంతువులు అంటే.. అంతే.. మ‌నం వాటిని ప్రేమ‌గా పెంచుకుంటే అవి మ‌న‌పై ఎంతో ప్రేమ‌ను చూపిస్తాయి. మ‌న‌తో ఆప్యాయంగా మెలుగుతాయి. అందుక‌నే మాన‌వులు ఎంతో పురాత‌న కాలం నుంచి కుక్క‌లు, పిల్లులు వంటి జంతువుల‌ను పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. అయితే కొన్ని పెంపుడు జంతువులు మాత్రం త‌మ య‌జ‌మానుల‌ను ఎల్ల‌ప్పుడూ అంటి పెట్టుకునే ఉంటాయి. దీంతో వారు ఒక వేళ చ‌నిపోతే అవి ఆ బాధ నుంచి బ‌య‌ట ప‌డ‌వు. సెర్బియాలోనూ అచ్చం ఇలాగే జ‌రిగింది.

Cat spends at its owners grave daily

సెర్బియాలో గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన షేక్ మౌమ‌ర్ జుకోర్లి అనే వ్య‌క్తి చ‌నిపోయాడు. అత‌ను ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు. అయితే అత‌ను చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి అత‌ని పెంపుడు పిల్లి రోజూ అత‌ని స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి కాసేపు కూర్చుని వ‌స్తోంది. దీంతో ఆ దృశ్యాన్ని చూసి అంద‌రూ చ‌లించిపోతున్నారు.

ఇక ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. ఆ పిల్లి ఫొటో కాస్తా వైర‌ల్‌గా మారింది. అలా ఆ పిల్లి గ‌త 2 నెల‌ల నుంచి ఇలాగే చేస్తోంది. త‌న య‌జ‌మాని స‌మాధి వ‌ద్ద రోజూ కాసేపు గ‌డిపి వ‌స్తోంది. ఎప్ప‌టికైనా అత‌ను వ‌స్తాడ‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్న‌ట్లు ఆ పిల్లి మ‌న‌కు క‌నిపిస్తోంది. అయితే ఈ ఫొటో వైర‌ల్ కాగా ఇప్ప‌టికే దీనికి 60వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. అంద‌రూ ఆ పిల్లికి య‌జ‌మాని ప‌ట్ల ఉన్న అభిమానం, ప్రేమ‌ను చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now