BSF Jobs : ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బీఎస్ఎఫ్‌లో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు గాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మొత్తం 2788 పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సదరు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. నిరుద్యోగ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. మొత్తం 2788 పోస్టులను ఇందులో భాగంగా భర్తీ చేస్తారు. ఫిబ్రవరి 28, 2022వ తేదీని దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.
10వ తరగతి విద్యార్హత ఉన్నవారు, సంబంధిత ట్రేడ్‌లలో 2 ఏళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పురుషుతు 167.5 సెం.మీ., స్త్రీలు 157 సెం.మీ., ఎత్తు ఉండాలి. ఛాతి పురుషులకు 78-83 సెం.మీ. ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, గిరిజనులకు ఎత్తు పురుషులకు 162.5, స్త్రీలకు ఎత్తు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతి పురుషులకు 76-81 ఉండాలి.
కొండ ప్రాంతాల అభ్యర్థుల్లో పురుషులకు ఎత్తు 165 సెం.మీ, స్త్రీలకు ఎత్తు 150 సెం.మీ. ఉండవచ్చు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. వేతనం భారీగానే లభిస్తుంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…