Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ను కొట్టినందుకు థియేటర్లోనే ఏడ్చిన‌ బుడ్డోడు.. వీడియో వైరల్..!

March 27, 2022 2:21 PM

Ram Charan : సాధారణంగా సినిమాలలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటారు. కొందరైతే ఏకధాటిగా ఏడుస్తూ ఉంటారు. మరికొందరు ఆ బాధను వారి గుండెల్లోనే పెట్టుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన RRR సినిమాలో అల్లు సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ఇక అల్లూరి పాత్రలో ఉన్న చరణ్ బ్రిటిష్ వారి చేత దెబ్బలు తింటారు.

boy cried for hitting Ram Charan in RRR movie
Ram Charan

ఈ విధంగా ఈ సినిమాలో రామ్ చరణ్ ను కొట్టడం వంటి ఎమోషనల్ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఇలా రామ్ చరణ్ దెబ్బతినడంతో అది చూసిన ఓ బుడ్డోడు థియేటర్లోనే తన అభిమాన నటుడు రామ్ చరణ్ ను కొట్టారని ఆయ‌న‌ని ఈ సినిమాలో విలన్ ను చేశారంటూ బోరున ఏడ్చాడు. ఇక ఈ విషయం గమనించిన పక్కన వ్యక్తి ఈ సన్నివేశాన్ని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Wirally (@wirally)

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా బుడ్డోడు రామ్ చరణ్ ను కొట్టినందుకు ఏడుస్తూ ఉండగా పక్కనే ఉన్న తన తల్లి నిజంగా కొట్టలేదని తిరిగి వారిద్దరూ ఫ్రెండ్స్ అవుతారని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఆ బుడ్డోడు ఏకధాటిగా ఏడవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now