Boxing : స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగానే ఉంటుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పవచ్చు. ఇటీవల డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. భారీ అంచనాల నడుమ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. ఇలా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ఏవి హిట్ మరియు ఏవి ఫ్లాప్ గా నిలిచాయో ఓ లుక్కేద్దాం రండి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. చిన్న వయసు నుంచే కరాటే నేర్చుకున్న పవన్ కల్యాణ్ ఈ సినిమాలో తన నటనతో అదరగొట్టారు. పవన్ కు కిక్ బాక్సింగ్, కరాటే అంటే చాలా ఇష్టం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ మరో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో స్వీయ దర్శకత్వంలో జానీ సినిమాలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన జానీ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన మూవీ అమ్మానాన్న ఓ తమిళమ్మాయి. ఈ మూవీ కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మాధవన్ ముఖ్యపాత్ర వహించిన బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సాలా కుద్దూస్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటించి బాక్సర్ గా అదరగొట్టింది. ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో గురు పేరుతో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ చిత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. తమిళ హీరో ఆర్య నటించిన సారపట్ట సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సారపట్ట చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…