Bithiri Sathi : కొత్త సినిమాల‌కు ప్ర‌మోష‌న్స్‌.. స్టార్స్‌ను ఇంట‌ర్వ్యూ చేస్తూ బాగానే సంపాదిస్తున్న స‌త్తి..!

Bithiri Sathi : ప్ర‌స్తుత త‌రుణంలో యూట్యూబ్ చాన‌ల్స్ ఎంత పాపుల‌ర్ అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది యూట్యూబ్‌లో చాన‌ల్స్‌ను ర‌న్ చేస్తూ ఎంతో పాపుల‌ర్ అవ‌డ‌మే కాక‌.. డబ్బుల‌ను కూడా సంపాదిస్తున్నారు. ఇక సినిమా తార‌లు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్స్ కోసం టీవీ చాన‌ల్స్ ను ఆశ్ర‌యించేవారు. కానీ ఇప్పుడు టీవీల‌తోపాటు యూట్యూబ్ చాన‌ల్స్‌ను కూడా వారు ఆశ్ర‌యిస్తున్నారు. యూట్యూబ్ చాన‌ల్‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తే సినిమాల‌కు ప్ర‌మోష‌న్ బాగా అవుతుంది. అందుక‌నే చాలా మంది మేక‌ర్స్ త‌మ సినిమాల‌కు ప్ర‌మోష‌న్ కోసం యూట్యూబ్ చాన‌ల్స్ ను సంప్ర‌దిస్తున్నారు. ఇక ఈ విష‌యాన్ని బాగానే వంట బ‌ట్టించుకున్న బిత్తిరి స‌త్తి సినీ తార‌ల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తే భారీగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

యాంక‌ర్ సుమ ఏదైనా ఫంక్ష‌న్‌కి యాంక‌రింగ్ చేస్తే సుమారుగా రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.3 ల‌క్ష‌ల మేర పారితోషికం అందుకుంటుంది. అదే స్థాయిలో బిత్తిరి స‌త్తి కూడా సినీ మేక‌ర్స్ నుంచి రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మొన్నామ‌ధ్య ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ కోసం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, తార‌క్, చ‌ర‌ణ్‌ల‌ను స‌త్తి ఇంట‌ర్వ్యూ చేశాడు. త‌న దైన యాస‌, భాష శైలితో వారిని స‌త్తి ఇంట‌ర్వ్యూ చేసి న‌వ్వుల పువ్వుల పూయించాడు. దీంతో ఆయ‌న వారి నుంచి భారీగానే రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు తెలుస్తోంది.

Bithiri Sathi

ఇక ఆర్ఆర్ఆర్ టీమ్‌తో ఇంట‌ర్వ్యూ స‌క్సెస్ అయిన కార‌ణంగా మ‌హేష్ త‌న సర్కారు వారి పాట కోసం కూడా స‌త్తికి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఆ ఇంట‌ర్వ్యూ కూడా స‌క్సెస్ అయింది. స‌త్తి చేసిన కామెడీకి మ‌హేష్ క‌డుపుబ్బా న‌వ్వారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ స‌త్తి ఎఫ్3 మూవీ టీమ్‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. దీంతో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌లు భ‌లే కామెడీని పండించారు. వీరి ఇంట‌ర్వ్యూ వీడియో కూడా వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే స‌త్తితో ఇంట‌ర్వ్యూ చేయిస్తే సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అందుక‌నే ఆయ‌న ఈమ‌ధ్య కాలంలో దాదాపుగా అన్ని సినిమాల‌కు చెందిన స్టార్స్‌తో ఇంట‌ర్వ్యూ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే స‌త్తికి భారీగానే పారితోషికం అందుతుంద‌ని తెలుస్తోంది.

ఇక ప‌లు టీవీ చాన‌ల్స్‌లో ప‌నిచేసి మానేసిన స‌త్తి సొంత యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఇలా బాగానే సంపాదిస్తున్నాడ‌ని స‌మాచారం. ఏది ఏమైనా ప్ర‌స్తుతం ఇలా పాపుల‌ర్ యూట్యూబ్ చాన‌ల్స్ కు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం సినిమా మేక‌ర్స్‌కు ఎంతో అనుకూల అంశంగా మారింది. సినిమా ప్ర‌మోష‌న్ వేగంగా జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలోనే ప్రేక్ష‌కులు ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు క‌నుక అందులో ఇలా ప్ర‌మోష‌న్ చేస్తే సినిమాకు ఎక్కువ ప్ర‌చారం ల‌భిస్తుంది. క‌నుక‌నే మేక‌ర్స్ కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక ఎఫ్‌3 మూవీ ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుండ‌గా.. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM