Bimbisara : బింబిసార 2లో లేడీ విల‌న్‌..? క‌ల్యాణ్‌రామ్‌ను ఢీకొట్టేది ఎవ‌రు..?

August 31, 2022 9:58 AM

Bimbisara : బింబిసార సినిమా ఎటువంటి భారీ అంచ‌నాలు లేకుండానే విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని మ‌రొక‌సారి రుజువు చేశారు. చాలా రోజుల త‌రువాత క‌ళ్యాణ్ రామ్ ఖాతాలో మంచి హిట్ వ‌చ్చి చేరింది. మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు వశిష్ట్ త‌నని తాను నిరూపించుకున్నాడు. ఇక బింబిసార విడుద‌ల అయిన రెండో రోజే దీనికి రెండ‌వ భాగం చేయ‌నున్న‌ట్లు ఈ చిత్ర హీరో ద‌ర్శ‌కులు ప్ర‌క‌టించారు. ఇక‌ అప్పుడే దీనిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.

అయితే ఈ ఊహాగానాల్లో భాగంగా బింబిసార 2 మూవీలో క‌ళ్యాణ్ రామ్ ను ఢీకొట్టే విల‌న్ పాత్ర‌లో ఒక ప్ర‌ముఖ‌ న‌టి చేయ‌నుంద‌ని ప్ర‌చారం చేయ‌డం మొదలుపెట్టారు. కానీ ద‌ర్శ‌కుడు దీనిపై స్ప‌ష్ట‌త‌నిచ్చేందుకు త్వ‌ర‌గా స్పందించారు. ఆయ‌న ఈ అపోహ‌ల‌ను కొట్టిపారేస్తూ.. తాము బింబిసార సీక్వెల్ గురించి కేవ‌లం ఆలోచ‌న మాత్ర‌మే చేశామ‌ని, దానికి సంబంధించిన వివ‌రాలేవీ ఇంకా అనుకోలేద‌ని తెలియ‌జేశారు.

Bimbisara second part lady villain character
Bimbisara

అయితే అంత‌కు ముందు బింబిసార సినిమాకు ప్రీక్వెల్ గా బింబిసార 2 ను తీయాల‌నే ఆలోచ‌న వ‌చ్చిందని, ఆ క‌థ‌ బింబిసారుడి గ‌తంలో ఆయ‌న ఉన్న‌త స్థితిని అలాగే అత‌ని ప‌త‌నాన్ని తెలిపే విధంగా మొద‌టి భాగానికి ముందు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌న్నీ అందులో ఉండేలా ఉటుంద‌ని చెప్పారు. ఇంకా 2వ భాగంలో చాలా యుద్ధ స‌న్నివేశాలలో కూడి ఉంటుంద‌ని తెలిపారు.

కానీ ఇందులో ఉండ‌బోయే పాత్ర‌ల‌ను గానీ వాటిని చేయ‌బోయే న‌టీన‌టుల‌ను గానీ ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఇక క‌ళ్యాణ్ రామ్ ఇదివ‌ర‌కు బింబిసార మొద‌టి భాగం హిట్ అయితే రెండ‌వ భాగం ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన‌ట్లుగానే సీక్వెల్ రావ‌డం ఖాయం అయ్యింద‌ని, కాబ‌ట్టి ఇప్పుడు వారిపై ఒత్తిడి ఇంకా ఎక్కువ‌గా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now