Bimbisara : మ‌గ‌ధీర + బాహుబ‌లి = బింబిసార‌.. హిట్ అయితే క‌ల్యాణ్ రామ్ ద‌శ తిరిగిన‌ట్లే..!

July 9, 2022 11:34 AM

Bimbisara : నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ వెండి తెర‌పై క‌నిపించి చాలా రోజులే అవుతోంది. 2020లో ఎంత మంచి వాడ‌వురా అనే మూవీతో ఈయ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కానీ ఈ మూవీ అస‌లు రిలీజ్ అయిన‌ట్లే చాలా మందికి తెలియ‌దు. దీనికి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించ‌లేదు. అయితే క‌ల్యాణ్ రామ్ వాస్త‌వానికి హిట్ కొట్టి చాలా రోజులే అవుతోంది. ఆయ‌న న‌టించిన ప‌టాస్ సినిమా స‌క్సెస్ త‌రువాత ఏ మూవీ కూడా విజ‌యం సాధించ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు మ‌రోమారు ఇంకో సినిమాతో రానున్నారు. ఈయ‌న న‌టించిన బింబిసార మూవీ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది.

బింబిసార మూవీని భారీ బ‌డ్జెట్‌తో క‌ల్యాణ్ రామ్ తానే స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ఆయ‌న కెరీర్‌లోనే ఈ మూవీ భారీ బ‌డ్జెట్ సినిమా. దీన్ని 4 పార్ట్‌లుగా రిలీజ్ చేస్తామ‌ని చెప్పారు. అయితే మొద‌టి పార్ట్ హిట్ అయితేనే 2, 3, 4 వ‌స్తాయి. లేదంటే లేదు. కానీ ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ ట్రైల‌ర్‌ను చూస్తుంటే మాత్రం హిట్ ప‌క్కా అని అంటున్నారు. ఫ్యాన్స్ అయితే మ‌గ‌ధీర‌, బాహుబ‌లి క‌ల‌గలిపి బింబిసార మూవీ అదిరిపోయిందని అంటున్నారు. దీంతో ప్రేక్ష‌కుల నుంచి మూవీకి రెస్పాన్స్ అయితే భారీగానే వ‌స్తోంది.

Bimbisara is it the movie turning point for Kalyan Ram
Bimbisara

ఇక క‌ల్యాణ్ రామ్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టికే ఎన్నో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేశారు. ఆ కోవ‌లోనే ఇప్పుడు బింబిసార కూడా రాబోతోంది. ఈ మూవీని ఆగ‌స్టు 5వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. అందులో భాగంగానే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లోనూ స్పీడ్ పెంచారు. ఈ సినిమాను రూ.40 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇందులోనూ మ‌గ‌ధీర‌లా పున‌ర్జ‌న్మ లాంటి స‌న్నివేశాలు ఉంటాయ‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది.

అయితే బింబిసార మూవీ గ‌న‌క హిట్ అయితే కేజీఎఫ్‌లా త‌రువాతి పార్ట్‌ల‌ను తీస్తామ‌ని క‌ల్యాణ్ రామ్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆ పార్ట్‌ల‌కు స‌రిపోయేట్లు ఇప్పుడే కొన్ని సీన్ల‌ను ముందుగా తీసి పెట్టుకున్నార‌ట‌. సినిమా హిట్ అయితే ఈ సీన్ల‌ను త‌రువాతి పార్ట్‌ల‌లో వాడుతారు. అచ్చం కేజీఎఫ్ ఫార్ములానే ఇది. అయితే చాలా రోజల త‌రువాత మ‌రోమారు క‌ల్యాణ్ రామ్ ఏకంగా భారీ బ‌డ్జెట్ మూవీతో వ‌స్తుండ‌డంతో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు అయితే భారీగానే ఉన్నాయి. మ‌రి ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now