Bigg Boss : ఖ‌రీదైన కారుని సొంతం చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!

November 27, 2021 1:08 PM

Bigg Boss : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ షో ఓవైపు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే మరోవైపు ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్‌లకు సెలబ్రిటీ హోదాను తెచ్చి పెడుతోంది. కేవలం పాపులారిటీకి మాత్రమే పరిమితం కాకుండా కాసులు కూడా కురిపిస్తోంది. ఈ షోలో పాల్గొన్న కొంద‌రు కంటెస్టెంట్స్‌ సొంతిటిని నిర్మించుకుంటే, మరికొందరు కార్లను కొనుగోలు చేసుకుంటున్నారు.

Bigg Boss : ఖ‌రీదైన కారుని సొంతం చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!
Bigg Boss

హిమ‌జ‌, సోహెల్‌, అఖిల్‌, అరియానా, శివజ్యోతి, శ్రీముఖి కొత్త కార్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి విశ్వ కూడా వచ్చి చేరాడు. బీఎం డబ్ల్యూ కారు కొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు స్కూల్ ఫీజుకి కూడా డ‌బ్బులు లేవ‌ని చెప్పిన అత‌ను అంత కాస్ట్‌లీ కారు ఎలా కొన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే విశ్వ కారుతో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘నా జీవితంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్‌ వచ్చింది. కలలు కన్న కారును కొంటే ఆ ఆనందమే వేరు. మొత్తానికి నేను ఎంతగానో ఇష్టపడే కారును కొని కల నెరవేర్చుకున్నాను. దీనికి కారణమైన ఆ దేవుడికి, బిగ్‌బాస్‌కు ఇవే నా కృతజ్ఞతలు. అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.

టాస్క్‌లో గట్టి పోటీ ఇచ్చే విశ్వ.. బిగ్ బాస్ ఇంట్లోనూ అందరితో కలిసిపోయేవాడు. కానీ ఎక్కువగా సింపతీ కార్డు ఉపయోగించాడనే ముద్ర పడిపోయింది. ఎక్కువగా ఏడ్వడం, ప్రేక్షకుల్లో సింపతీ కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడా ? అనే అనుమానం పెరిగింది. ఈ కార‌ణంగానే తొందర‌గా ఎలిమినేట్ అయ్యాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment