Bigg Boss : ఇకపై 24 గంటలూ బిగ్‌ బాస్‌.. హోస్ట్‌గా బాలకృష్ణ..?

December 24, 2021 4:32 PM

Bigg Boss : అన్ని ప్రాంతీయ భాషల‌లోనూ స‌క్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకొని త్వ‌ర‌లో ఆరో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. ఇది కాకుండా ఓటీటీలో తెలుగు బిగ్‏బాస్ షో రాబోతుంద‌ని దానికి బాలకృష్ణ హోస్టింగ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. ఇప్పటివరకూ చూసిన బిగ్‌బాస్‌ షోకి.. ఓటీటీలో చూడబోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ విభిన్నమైన ఫార్మాట్లు అని అన్నారు.

Bigg Boss  will be streamed 24 hours a day balakrishna may be host

బిగ్‌బాస్‌ ఓటీటీ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నాం. షో ఎలా ఉండాలి ? ఎంతమంది కంటెస్టెంట్స్‌ ? ఎన్ని రోజులు ? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తాం అని తెలిపారు నాగ్. ఈ షోకి వ్యాఖ్యాతగా అడుగుపెట్టే సమయంలో ఏదో తెలియని భయం.. కానీ అడుగుపెట్టాక.. నేను కూడా ఈ షోకి అభిమానిగా మారిపోయాను. సీజన్‌-3, 4 పూర్తయ్యాక కంటెస్టెంట్స్‌ చాలామంది మా ఇంటికి వచ్చి.. షో మాకెంతో నేర్పించింది. మేము లైఫ్‌లో ఎంతో సక్సెస్‌ అయ్యాం అని చెబుతుంటే నేనెంతో ఆనందించాను.

డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యం నావద్దకు వచ్చి.. ‘బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం అని చెప్పడంతో షాక్‌ అయ్యాను. చివరికి వాళ్లు ఒప్పించారు. బిగ్‌బాస్‌కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్‌బాస్‌ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బాస్‌ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్‌హిట్‌. త్వరలోనే ఓటీటీ ప్రారంభం కానుందని నాగార్జున అన్నారు.

అయితే బిగ్‌బాస్‌ తదుపరి సీజన్‌కు బాలకృష్ణ హోస్ట్‌గా వస్తారని ప్రచారం జరుగుతుంది కదా.. దానిపై మీ స్పందన ఏమిటి ? అని ప్రశ్నించగా.. అందుకు నాగ్‌ బదులిస్తూ.. బిగ్‌బాస్‌కు తానే హోస్ట్‌గా ఉంటానని తెలిపారు. దీంతో సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టినట్లు అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now