Bigg Boss : బిగ్ బాస్ లో అనూహ్య నిర్ణ‌యం.. గ‌తంలో ఎన్న‌డూ ఇలా చేయ‌లేదు..!

September 12, 2022 2:53 PM

Bigg Boss : సెప్టెంబర్ 4వ తేదీన బుల్లితెరపై ఘనంగా బిగ్ బాస్ సీజన్ 6 హంగామా మొదలైంది. మొదటి రోజు మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ ఒకరికి ఒకరు పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ ను చూపిస్తున్నారు. అందరికీ షాక్ ఇచ్చేలా బిగ్‌ బాస్‌ తెలుగు చరిత్రలోనే మొదటి సారిగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటి సభ్యులు, ఆడియెన్స్ షాక్‌ అయ్యేలా ఒక‌ ప్రకటన చేశారు.

ఆటలు, పాటలు.. మధ్యలో ఎలిమినేషన్‌ అంటూ ఆదివారం ఎపిసోడ్‌ని మొదలు పెట్టారు హోస్ట్ నాగార్జున. చెప్పినట్లుగానే ఇంటి సభ్యులతో వెరైటీ గేమ్స్‌ ఆడించడం మొదలు పెట్టారు. ముందుగా ఎవరికి ఎంత తెలుసు అనే ఆట మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యుల‌ గురించి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు నాగార్జున. శ్రీహాన్‌ హౌజ్‌లో మొదట ఏ ప్లేస్‌కు వెళ్లాడు,  శ్రీసత్య శరీరంపై ఎన్ని టాటులు ఉన్నాయి లాంటి ఫన్నీ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ల‌తో ఈ గేమ్‌ ముగిసింది. ఈ గేమ్‌లో నాగార్జున అడిగిన ప్రశ్నలకు ఎక్కువ జవాబు చెప్పి బాలాదిత్య స్టార్‌ ఆఫ్‌ ది వీక్‌ గా నిలిచాడు.

Bigg Boss took sensational decision first time in show
Bigg Boss

ఎలిమినేషన్‌లో ఉన్న ఐదుగురికి ఒక్కో బ్యాట‌న్‌ ఇచ్చి వాటిని ఓపెన్‌ చేయమని చెప్పారు నాగార్జున. అందులో బ్లూ కలర్‌ వచ్చినవారు సేఫ్‌ అని చెప్పగా, అభినయశ్రీ, ఫైమా, ఇనయా, రేవంత్‌, ఆరోహిలలో జబర్దస్త్ ఫేమ్ ఫైమా సేవ్‌ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఐటమ్ నంబర్ గేమ్ ఆడించారు నాగార్జున. ఓ వస్తువును చూపిస్తే ఆ వస్తువుతో వచ్చే పాట ఏంటో కంటెస్టెంట్స్ గుర్తుపట్టాలి. ఈ గేమ్ కోసం ఇంటి సభ్యుల్ని ఎ, బి అనే టీమ్‌లుగా విభజించారు. ఎ టీమ్ లో రేవంత్, చంటి, శ్రీసత్య, అభినయశ్రీ, నేహా, అర్జున్, మెరీనా, రోహిత్, కీర్తి, షానీ, ఇనయా ఉండగా, మిగతావాళ్లు బి టీమ్ లో ఉన్నారు. ఈ ఆటలో టీమ్ ఎ సభ్యులు విజయం సాధించారు.

ఇక ఆట మధ్యలో రేవంత్ సేవ్ అయినట్లు వెల్లడించారు. చివరగా ఎలిమినేషన్‌లో ఇనయా సుల్తానా, అభినయశ్రీ మిగిలారు. వీరిద్దరినీ గార్డెన్‌ ఏరియాకి పిలిచిన నాగార్జున అక్కడ ఉన్న రెండు భారీ సుత్తులను ఎత్తాల్సి ఉంటుంది. సుత్తి లేపలేని వారు ఎలిమినేట్‌ అవుతారని తెలిపారు. కానీ ఇద్దరూ లేపడంతో అందరూ షాక్‌ అయ్యారు. దీంతో ఇద్దరు సభ్యులు సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. హౌస్‌లోకి వచ్చి వారమే అవుతుంది కాబట్టి, ఇప్పుడిప్పుడే అందరూ సెటిల్ అవుతున్నారు. అందుకే ఈ వారం ఎలిమినేష‌న్‌ లేదు అని నాగార్జున వెల్లడించడంతో కంటెస్టెంట్స్ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఆదివారం షో సండే ఈజ్‌ ఫన్ డే అన్నట్లు ఆటలతో సరదాగా, ఎలిమినేషన్ ల‌తో టెన్షన్ గా, ఫైనల్ గా హ్యాపీగా ముగిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now