Bigg Boss Shanmukh : ల‌గ్జ‌రీ కారు కొన్న బిగ్ బాస్ షణ్ముఖ్.. దాని ధర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

October 6, 2022 1:05 PM

Bigg Boss Shanmukh : ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది యూత్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యాక్టింగ్, డ్యాన్స్ చేస్తూ అతడు అప్‌లోడ్ చేసిన వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అతడి పేరు సెన్సేషన్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన షణ్ముఖ్ గత ఏడాది బిగ్ బాస్ సీజన్‌ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. కానీ హౌస్‌లో సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రచ్చ వల్ల అతడికి చెడ్డ పేరు వచ్చింది.

దీంతో షణ్ముఖ్ ప్రేమించిన దీప్తి సునైనా కూడా అతడికి బ్రేకప్ చెప్పేసింది. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. అయితే షణ్ముఖ్ దసరా పండగ వేళ ఖరీదైన కారు సొంతం చేసుకున్నాడు. లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారు దక్కించుకున్నాడు. పేరెంట్స్ తోపాటు హైదరాబాద్ షో రూమ్ కి వెళ్లిన షణ్ముఖ్ తన కల సాకారం చేసుకున్నాడు. ఇక కొత్తకారు పక్కనే ఫోజులిస్తూ ఫోటోలు దిగాడు. ఈ సంతోషకర‌మైన‌ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

Bigg Boss Shanmukh bought luxury BMW car know the price
Bigg Boss Shanmukh

నన్ను ఈ స్థాయిలో చూడాలనుకున్నది పేరెంట్స్, మీరు (ఫ్యాన్స్) మాత్రమే.. ఇంకెవరూ కాదని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ కారు కొనడం కలలా ఉంది. ఎప్పుడైనా కనిపిస్తే లిఫ్ట్ అడగండి తప్పక ఇస్తానని ప్రామిస్ చేశాడు. అయితే షణ్ముఖ్ కొన్న కొత్త కారు ఖరీదు భారీగానే ఉంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కి చెందిన ఆ కారు ధర రూ.51 లక్షల వరకూ ఉంది. ఎప్పటి నుండో లగ్జరీ కారు కొనాలనుకుంటున్న షణ్ముఖ్ ఎట్టకేలకు బీఎండబ్ల్యూ సొంతం చేసుకున్నాడు. ఇటీవల డిటెక్టివ్‌గా షణ్నూ నటించిన వెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ ఆహాలో స్ట్రీమింగ్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now