Bigg Boss Sarayu : బిగ్ బాస్ ఫేమ్ స‌ర‌యుపై కేసు న‌మోదు.. వివాదంలో సాంగ్‌..

February 6, 2022 10:28 PM

Bigg Boss Sarayu : యూట్యూబ్‌లో పాపుల‌ర్ అయిన స‌ర‌యు త‌రువాత బిగ్ బాస్‌లో పాల్గొని మ‌రింత ఫేమ్‌ను సంపాదించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆమె ఇటీవ‌ల ఓ హోట‌ల్ బిజినెస్‌ను కూడా ప్రారంభించింది. అయితే ఆ హోట‌ల్ ప్ర‌మోష‌న్ కోసం ఆమె తీసిన ఓ పాట వివాదాస్ప‌దం అవుతోంది. అందులో ఆమె అభ్యంత‌ర‌క‌ర‌మైన రీతిలో ప్ర‌వ‌ర్తించింద‌ని ఒక‌రు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

Bigg Boss Sarayu landed in controversy over her latest song
Bigg Boss Sarayu

స‌ర‌యు త‌న హోట‌ల్ ప్ర‌మోష‌న్ కోసం తీసిన పాట‌లో త‌ల‌కు గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా బ్యాండ్ ఉంటుంద‌ని, దాన్ని ధ‌రించి మ‌ద్యం సేవించార‌ని.. దేవుడి బొమ్మ‌లు ధ‌రించి మద్యం సేవిస్తూ హోట‌ల్‌ను ద‌ర్శించాల‌ని చెప్ప‌డం క‌రెక్ట్ కాద‌ని.. ఆరోపిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

హిందువుల మనోభావాల‌ను దెబ్బ‌తీసే విధంగా స‌ర‌యు ప్ర‌వ‌ర్తించింద‌ని, క‌నుక ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు అక్క‌డ కేసు న‌మోదు చేసి దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు బ‌దిలీ చేశారు. ఇక ఈ విష‌యంపై స‌ర‌యు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంది.

అయితే స‌ర‌యు త‌న 7 ఆర్ట్స్ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా అనేక షార్ట్ ఫిలిమ్స్ చేసింది. వాటిల్లో ఆమె ప‌చ్చి బూతులు మాట్లాడుతుంటుంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నెటిజన్లు ఆమె ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల ఎల్ల‌ప్పుడూ ఆమెను విమ‌ర్శిస్తుంటారు. ఇక తాను గ‌తంలో ఒక వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం కూడా చేశాన‌ని.. కానీ అత‌ని చేతిలో మోస‌పోయాన‌ని.. స‌ర‌యు గ‌తంలోనే చెప్పింది. దీంతో అప్ప‌ట్లో ఆమె చెప్పిన ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now