Priyanka Singh : బిగ్ బాస్ షోలో కొందరు కంటెస్టెంట్స్ మధ్య ప్రేమ, దోమ పుట్టడం సహజం. కొందరు హౌజ్‌లో ఉన్నన్ని రోజులు ప్రేమ అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎవరి దారులు వారు వెతుక్కుంటున్నారు. మరి కొందరు మాత్రం ప్రేమను కంటిన్యూ చేస్తూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో ఓ ఆసక్తికర ప్రేమాయణం సాగింది. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక.. మానస్‌ని తెగ ఇష్టపడింది. దేవుడు తనకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేదని, అప్పుడు మానస్‌తో హ్యాపీగా ఉండేదాన్ని అంటూ ఎమోషనల్ అయ్యింది. మానస్‌పై పింకీ మరింతగా ప్రేమని పెంచుకోగా, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా పుకార్లు పుట్టించారు.
హౌజ్‌లో మానస్‌కి కాస్త నెగెటివిటీ వచ్చింది ప్రియాంక వల్లనే అని చెప్పొచ్చు. హౌస్‌లో పలు సందర్బాల్లో ప్రియాంక తన ప్రేమను వ్యక్తపరిచినప్పటికీ మానస్ ఆమెను దూరం పెట్టేవాడు. అయితే తనకు ఏమి కావాలన్నా ప్రియాంకతోనే చేయించుకునేవాడు మానస్. ఇక బిగ్ బాస్ కూడా వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడిపించడానికి గట్టి ప్రయత్నాలే చేశాడు. మానస్ పేరు చెబితేనే మెలికలు తిరిగిపోతుండడం.. అతను దూరం దూరం అంటున్నా.. ఆమె మాత్రం అతని పక్కనే తిష్ట వేస్తూ.. అతి ప్రేమ చూపించడం ఇలా చాలా చేసింది.
అయితే బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసిన సందర్భాలు లేవు. తాజాగా ప్రియాంక సింగ్ మానస్ తో ఒక లవ్ సీన్ తో రీల్ చేసింది. అబ్బాయిలు స్మార్ట్ గా ఉండడం కన్నా కూడా ఇన్నోసెంట్ గా ఉంటేనే బాగుంటుంది.. నాకు వాడి ఇన్నోసెన్స్ చాలా ఇష్టం.. అనే డైలాగ్ ను చెప్పిన ప్రియాంకను మానస్ చూసి సిగ్గుపడిపోయాడు. ప్రస్తుతం ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనిపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…