Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ యాంక‌ర్, కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా ?

December 30, 2021 12:20 PM

Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లోనూ ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతోంది. తెలుగులోనూ ఈ షోని ఆద‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ ఓటీటీ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన వెంటనే.. అదే స్టేజ్‌పై నుంచి బిగ్ బాస్ ఓటీటీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున.

Bigg Boss OTT Telugu this is the anchor and contestants list

మరో రెండు నెలల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతుందని చెప్పారు. 24 గంటలూ ఏకధాటిగా ఈ షోని హాట్ స్టార్‌లో లైవ్ ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ షోని ఎవ‌రు హోస్ట్ చేయ‌నున్నారు, ఎవ‌రు కంటెస్టెంట్ లుగా ఉంటారు అనే దానిపై జోరుగా ప్ర‌చారాలు సాగుతున్న నేప‌థ్యంలో ఓంకార్‌ చేతికి బిగ్ బాస్ ఓటీటీ పగ్గాలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. బుల్లితెరపై ఓంకార్ ఓ ట్రెండ్ సెట్టర్. ‘ఆట’, ‘సిక్స్త్ సెన్స్’, ‘ఇస్మార్ట్ జోడీ’, ‘మాయా ద్వీపం’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో టీఆర్పీ రేటింగ్స్‌ని పెంచాడు.

తెలుగు బిగ్ బాస్ ఓటీటీ షోకి సారథ్య బాధ్యతల్ని ఓంకార్ OAK ఎంటర్‌టైన్మెంట్స్‌కి అప్పగించినట్టు తెలుస్తోంది. ఓంకార్ షో అంటే.. ఎలాగూ ఆయనే హోస్ట్ చేస్తారు కాబట్టి.. బిగ్ బాస్ హౌస్‌లో వన్ సెకండ్ అని ఓంకార్ మార్క్ చూపించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ లిస్ట్ రెడీ చేసి పెట్టారట. సీజన్ 5 కంటెస్టెంట్స్‌‌గా చాలా మందికి ఫోన్లు వెళ్లాయి. చివరికి 19 మందిని ఫైనల్‌గా చేశారు. వారిలో ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చా, కత్తర్ పాప, యాంకర్ శివ, బంజారాహిల్స్ ప్రశాంత్, టిక్ టాక్ దుర్గారావు వంటి పేర్లు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now