Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ ఓటీటీ.. కంటెస్టెంట్లు వీరేనా..?

January 30, 2022 9:12 PM

Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 విజ‌య‌వంతంగా పూర్తి కావ‌డంతో త్వ‌ర‌లోనే బిగ్‌బాస్ ఓటీటీని ప్రారంభిస్తామ‌ని హోస్ట్ నాగార్జున అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం నుంచి ఈ షో ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. దాని ప్ర‌కారం.. కొంద‌రు పాత కంటెస్టెంట్ల‌తోపాటు కొంద‌రు కొత్త కంటెస్టెంట్ల‌ను కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకోనున్నార‌ని తెలుస్తోంది.

Bigg Boss OTT Telugu these are may be the contestants
Bigg Boss OTT Telugu

తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న స‌మాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీలో 4 మంది పాత‌ కంటెస్టెంట్ల‌ను మ‌ళ్లీ తీసుకోనున్నార‌ని స‌మాచారం. అరియానా, అఖిల్‌, త‌నీష్, ఆద‌ర్శ్‌, అలీ రెజా, హ‌రితేజ వంటి పాత కంటెస్టెంట్ల‌ను బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకుంటార‌ని తెలుస్తోంది.

పాత కంటెస్టెంట్ల‌తోపాటు కొత్తగా యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, ఢీ10 విన్నర్‌ రాజు, టిక్‌టాక్‌ దుర్గారావు, సాఫ్ట్ వేర్‌ డెవలపర్స్ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాంకర్‌ ప్రత్యూష త‌దిత‌రుల‌ను కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వివ‌రాల‌పై స్ప‌ష్ట‌త రావ‌ల్సి ఉంది. త్వ‌రలోనే ఈ వివరాల‌ను వెల్ల‌డించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Bigg Boss OTT Telugu : రోజుకు 24 గంట‌లూ లైవ్..

కాగా బిగ్‌బాస్ ఓటీటీని 82 రోజుల పాటు ప్ర‌సారం చేస్తారు. రోజుకు 24 గంట‌లూ లైవ్ లో షోను ప్ర‌సారం చేస్తారు. దీంతో ప్రేక్ష‌కులు మ‌రింత ఆద‌రిస్తార‌ని నిర్వాహ‌కులు విశ్వ‌సిస్తున్నారు. ఇక ఈ వివ‌రాల‌న్నింటిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now