Bigg Boss OTT Telugu : త్వ‌ర‌లోనే బిగ్ బాస్ ఓటీటీ..? ప్రారంభం అయ్యేది అప్పుడే..?

January 4, 2022 2:13 PM

Bigg Boss OTT Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షోగా బిగ్ బాస్ ఎంతో పేరు సాధించింది. ఈ షోను విమ‌ర్శించే వారు ఏ స్థాయిలో ఉన్నారో.. ఫ్యాన్స్ కూడా అంతే స్థాయిలో ఉన్నారు. అందుక‌నే ఈ షో గురించి ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. రేటింగ్స్ మాత్రం త‌గ్గ‌లేదు. ఇక ఇటీవ‌లే సీజ‌న్ 5 కూడా ముగిసింది. ఈ క్ర‌మంలోనే స‌న్నీ ఈ సీజ‌న్‌కు విజేత‌గా నిలిచాడు. అయితే అభిమానుల కోసం త్వ‌ర‌లోనే బిగ్‌బాస్ ఓటీటీని కూడా ప్రారంభిస్తామ‌ని ఇప్ప‌టికే నాగార్జున ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఈ షో ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.

Bigg Boss OTT Telugu may start very soon

బిగ్ బాస్ ఓటీటీ త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతుంద‌ని ఇదివ‌ర‌కే ప్ర‌కటించ‌గా.. ఈ షోను ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ నుంచి ప్ర‌సారం చేస్తార‌ని తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ ఓటీటీ కోసం యాంక‌ర్ శివ‌, వ‌ర్షిని, వైష్ణ‌వి, ఢీ విజేత రాజుల‌ను కంటెస్టెంట్లుగా తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

అయితే గ‌త సీజ‌న్ల వ‌ర‌కు బిగ్ బాస్ టీవీలో వ‌చ్చింది క‌నుక రోజూ 1 గంట మేర మాత్ర‌మే షోను ప్ర‌సారం చేశారు. కానీ ఓటీటీ కాబ‌ట్టి 24 గంట‌లూ లైవ్ చూపించ‌నున్నారు. దీంతో ఈ షోకు మ‌రిన్ని రేటింగ్స్ వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. అయితే ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన ఈ షోను ప్రారంభిస్తారా, లేదా.. అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now