Bigg Boss Non Stop : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు.. ఈ నెల 26వ తేదీ నుంచి షురూ..!

February 15, 2022 10:08 PM

Bigg Boss Non Stop : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించిన షో.. బిగ్‌బాస్‌. ఈ షో ఇప్ప‌టికే 5 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ఈ షో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముస్తాబ‌వుతోంది. అయితే ఈసారి టీవీలో మాత్రం ఈ షో రాదు. ఓటీటీలో వ‌స్తోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ ఓటీటీ తెలుగును ప్ర‌సారం చేయ‌నున్నారు. ఈ షో రోజుకు 24 గంట‌లూ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ఈ షోకు చెందిన తాజా ప్రోమోను నిర్వాహ‌కులు మంగ‌ళ‌వారం లాంచ్ చేశారు.

Bigg Boss Non Stop to start from 26th of this month
Bigg Boss Non Stop

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు తాజా ప్రోమోలో వినూత్నంగా షో గురించి ప్ర‌చారం చేశారు. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ చివ‌రి కోరిక కోర‌గా.. బిగ్ బాస్ చూడాల‌ని ఉంద‌ని చెబుతాడు. అయితే ఈ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ క‌నుక అత‌ను చూస్తూనే ఉంటాడు. దీంతో ఉరి శిక్ష నుంచి త‌ప్పించుకుంటాడు. ఇలా ఫ‌న్నీ వేలో బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రోమోను తీశారు. ఇందులో నాగార్జున‌తోపాటు వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌లు కూడా న‌టించారు.

https://youtu.be/QzcOrRNHZJE

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ప్రారంభం అయ్యే తేదీని కూడా ఈ ప్రోమోలో చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమ్ అవుతుంద‌ని తెలిపారు. అయితే కంటెస్టెంట్ల వివ‌రాలు మాత్రం తెలియ‌లేదు. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు కూడా తెలుస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now