Bigg Boss : బిగ్‌బాస్‌కు భారీ ఎదురుదెబ్బ‌.. షో నిలిచిపోయే అవ‌కాశం..?

October 1, 2022 9:11 AM

Bigg Boss : బిగ్‌బాస్ 6వ సీజ‌న్ మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి నిర్వాహ‌కుల‌కు క‌ష్టాలు తప్ప‌డం లేదు. అస‌లే ఈ సీజ‌న్‌కు రేటింగ్స్ లేక అల్లాడుతుంటే.. గోటి చుట్టు మీద రోక‌లి పోటు అన్న‌ట్లుగా.. సీపీఐ నారాయ‌ణ లాంటి వారు షోపై దారుణ‌మైన కామెంట్స్ చేయ‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీని వ‌ల్ల బిగ్ బాస్ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇత‌ర భాష‌ల్లోనూ బిగ్ బాస్‌ను నిర్వ‌హిస్తున్నారు. కానీ తెలుగులో మాత్ర‌మే ఈ సీజ‌న్‌కు దారుణ‌మైన రేటింగ్స్ వస్తున్నాయి. అయితే ఇద‌లా ఉంచితే.. ఈ షోకు ప్ర‌స్తుతం గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలేలా క‌నిపిస్తోంది. ఈ షో నిలిచిపోతుంద‌ని అంటున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రుగుతోంది.. అనే విష‌యానికి వ‌స్తే..

బిగ్ బాస్ షోలో కంటెంట్ శృతి మించుతుంద‌ని.. అశ్లీల‌త బాగా పెరిగిపోయింద‌ని.. అందువ‌ల్ల షో నిర్వాహ‌కుల‌పై, హోస్ట్ నాగార్జున‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ.. ఏపీ హైకోర్టులో న్యాయ‌వాది శివ ప్ర‌సాద్ రెడ్డి పిటిష‌న్ వేశారు. దాన్ని విచారించిన న్యాయ‌స్థానం కేసును విచార‌ణ‌కు స్వీక‌రించింది. అంతేకాదు.. షోపై, నిర్వాహ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు మ‌రికాస్త గడువు కావాల‌ని న్యాయ‌వాది కోర‌డంతో కోర్టు ఈ కేసు విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 11వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజే తీర్పు ఇస్తామ‌ని చెప్పింది. అయితే బిగ్ బాస్ షోపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో షో భ‌విష్య‌త్తు ఏమ‌వుతుంది.. కొన‌సాగిస్తారా.. నిషేధిస్తారా.. అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ నెల 11వ తేదీన ఏం జ‌రుగుతుంది.. అని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

Bigg Boss future is not there what happens to show
Bigg Boss

వాస్త‌వానికి బిగ్ బాస్ షోపై గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి ఆరోప‌ణ‌లు రాలేదు. సీపీఐ నారాయ‌ణ కూడా గ‌తంలో ప‌లు మార్లు ఈ షోపై కామెంట్స్ చేశారు. కానీ ఈసారి మాత్రం కామెంట్స్ స్థాయి పెరిగింది. ఏకంగా అందులో ఉన్న‌వారు అంద‌రూ వ్య‌భిచారం చేస్తున్నార‌ని.. వారికి గుండు కొట్టించాల‌ని, నాగార్జున డ‌బ్బుల కోసం క‌క్కుర్తి ప‌డి ఇలాంటి షోల‌ను ఎలా ప్రోత్స‌హిస్తారు.. అని నారాయ‌ణ అన్నారు. దానికి నాగార్జున కూడా షోలోనే కౌంట‌ర్ ఇచ్చారు.

అయితే రేటింగ్స్ ప‌డిపోవ‌డంతో.. మసాలాను ద‌ట్టించి రేటింగ్స్ పెంచుకునేందుకు య‌త్నిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. క‌నుక‌నే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ అభాసు పాల‌వుతోంది. జ‌నాల‌కు మెచ్చే విధంగా షోలో టాస్క్‌ల‌ను తీర్చిదిద్దితే బాగుంటుంది. అలా కాకుండా ఇలా మ‌సాలాతో నెట్టుకొస్తాం.. అంటే.. ఇలాగే జ‌రుగుతుంది. ఇక బిగ్ బాస్ భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now