Bigg Boss 5 : సిరి త‌ల్లి త‌ర‌పున సారీ చెప్పిన ప్రియుడు..!

November 26, 2021 8:08 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5లో రొమాంటిక్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్నారు సిరి-ష‌ణ్ముఖ్‌. వీరిద్ద‌రి ప్ర‌వ‌ర్తన ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జంట‌పాముల మాదిరిగా వీరు చేస్తున్న ర‌చ్చ‌కు నెటిజ‌న్స్ కోపోద్రిక్తుల‌వుతున్నారు. తాజాగా హౌజ్‌లోకి వ‌చ్చిన సిరి త‌ల్లి కూడా వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Bigg Boss 5 srihan said sorry on behalf of siri mother

తండ్రి లేని పిల్ల కదా అని షణ్ముఖ్ ఓ తండ్రిలా అన్నలా.. ఫ్రెండ్‌లా సిరికి హెల్ప్ చేస్తున్నాడు.. బాగా దగ్గరైపోతున్నాడు. దగ్గరకావడం మంచిదే కానీ.. హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదని సిరి త‌ల్లి చెప్తుండగా.. హా ఓకే , రా.. అంటూ సిరి తన తల్లిని మాట్లాడనీయకుండా చేసింది. సిరి ప్ర‌వ‌ర్త‌న అయితే ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు. శ్రీహాన్ అనే వ్య‌క్తితో నిశ్చితార్థం చేసుకొని లోప‌ల ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే శ్రీహాన్ ప్ర‌తిసారి వారికి స‌పోర్ట్‌గా నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌ లో.. సిరి తల్లికి ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది. పాపం వాళ్లు ఉం‍టున్న వాతావరణం అలాంటిది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే ఓర్చుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెపై కోప్పడవద్దు. ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇక సిరి, షణ్నూల రిలేషన్‌ను నేను గౌరవిస్తాను అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీహాన్‌ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now