Bigg Boss 5 : లో దుస్తులు ఎందుకు ప‌డేశావు.. అంటూ సిరిపై ఫైర్ అయిన ష‌ణ్ముఖ్‌..

November 5, 2021 9:00 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఈ సీజ‌న్‌లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లు ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాయి. తాజాగా కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో హీరోల టీమ్ నుంచి ఒక‌రిని టార్గెట్ చేసే ఛాన్స్ విల‌న్స్‌కు వ‌చ్చింది. దాంతో వారు ప్రియాంక‌ని సెల‌క్ట్ చేసి ముప్పు తిప్ప‌లు పెట్టారు. ఇక హీరోల టీంకి ఛాన్స్ రావ‌డంతో విల‌న్ టీం నుండి అనీ మాస్ట‌ర్‌ని ఎంపిక చేసుకొని ఆమెను నానా ఇబ్బందుల‌కి గురి చేశారు.

Bigg Boss 5  shanmukh very angry on siri for throwing clothes

తాజా ఎపిసోడ్‌లో సిరి, ష‌ణ్ముఖ్‌ల మ‌ధ్య ప్ర‌తిసారీ గొడ‌వ జ‌రుగుతూనే ఉంది. నాతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్‌గా చెప్ప‌మ‌ని ష‌ణ్నుని అడిగింది సిరి. దానిక‌త‌డు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక మాట్లాడ‌తాన‌ని బ‌దులిచ్చాడు. ఆ త‌ర్వాత ఎప్ప‌టిలాగే సారీ చెప్ప‌డమే కాక‌ 10 గుంజీలు తీశాడు. అయితే విల‌న్లు రాక్ష‌సావ‌తారం ఎత్తి ఇల్లంతా చింద‌ర‌వంద‌ర చేశారు. ఇందులో భాగంగా సిరి ఇంట్లో వారి బ‌ట్ట‌లన్నీ విసిరిపారేసింది. దీంతో రంగంలోకి దిగిన కెప్టెన్ ఇన్న‌ర్స్ ఎందుకు బ‌య‌ట‌కు తీశావ‌ని ప్ర‌శ్నించాడు.

బ‌ట్ట‌ల లోప‌ల అవి ఉన్నాయి, ఇప్పుడు తీస్తా అంటున్నా క‌దా, నా చేతి వేళ్లు నొప్పి వ‌స్తున్నాయి. 2 నిమిషాలు ఆగ‌మ‌ని చెప్పింది సిరి. ఆ ప‌ని ఇప్పుడే చేసి తీరాల‌ని ఆదేశించాడు. అత‌డి ఆజ్ఞ‌తో చిర్రెత్తిపోయిన సిరి.. తీయ‌న‌ని తేల్చి చెప్ప‌గా ఇది నీ క్యారెక్ట‌ర్.. అని నోరు జారాడు ష‌ణ్ను. బ‌ట్ట‌లు తీయ‌డానికి, క్యారెక్ట‌ర్‌కు సంబంధం లేద‌ని మండిప‌డుతూనే ఏడ్చేసింది సిరి. ఈ దెబ్బ‌ల క‌న్నా నువ్వ‌నే మాట‌లే ఎక్కువ బాధ‌గా ఉన్నాయంటూ వెక్కివెక్కి ఏడ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now