Bigg Boss 5 : ఆత్మ‌హ‌త్య చేసుకుందాం అనుకున్నా.. ష‌ణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్..

October 23, 2021 8:07 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్రమం రోజురోజుకీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అప్పటి వ‌ర‌కు క‌లిసి ఉండే హౌజ్‌మేట్స్ వెంట‌నే కొట్టుకోవ‌డం చూస్తుంటే అస‌లు బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెల‌కొంది. అయితే శుక్ర‌వారం బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌ని తమ జీవితంలో ఏర్ప‌డ్డ అడ్డంకుల గురించి వివ‌రించ‌మ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ష‌ణ్ముఖ్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Bigg Boss 5 shanmukh said he had suicidal thoughts that time

‘ఇంటర్‌ సెకండియర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. ఆ సమయంలో లవ్‌ బ్రేకప్‌ కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీలయ్యా. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యాను. స‌రిగ్గా అప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్ వ‌చ్చి డోర్ కొట్టాడు. నేను తీయ‌లేదు. అత‌డు నేరుగా లోప‌లికి వ‌చ్చి నాలుగు పీకాడు. ఈ రోజు నేను బ‌తికి ఉన్నానంటే వాడే కార‌ణం అని అన్నాడు ష‌ణ్ముఖ్‌. వైవా అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నాకు బ్రేక్‌ వచ్చిందని పేర్కొన్నాడు.

నేను వేరేవాళ్లను పెళ్లి చేసుకోబోగా అది ఆగిపోయింది, ఆ తర్వాత నేను ప్రేమించినవాడు చనిపోయాడు. అప్పుడు అందరూ అన్నారు.. తల్లేమైనా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి! అన్నారు. అప్పుడే డిసైడ్‌ అయ్యాను. నేనేంటో చూపిస్తానని! ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్‌ వచ్చి కెరియర్‌ ప్రారంభించాను అని సిరి చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now