Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్ రీసెంట్ గా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అభయహస్తం. ఈ గేమ్ లో మొత్తం ఐదు రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్ లో ఓడిపోయిన వారు సెకండ్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలా ఈ ఫస్ట్ టాస్క్ లో షణ్ముఖ్, లోబోలు బరిలోకి దిగారు. ఈ టాస్క్ కి సన్నీ సంచాలకుడిగా వ్యవహరించాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఈ గేమ్ లో మట్టి కలిపిన పేడలో ఉన్న ముత్యాల్ని కనిపెట్టాలి.
ఏ కంటెస్టెంట్ అయితే ఎక్కువ ముత్యాల్ని వెతికి పట్టుకుంటారో వాళ్ళే విన్నర్స్ అని బిగ్ బాస్ అంటారు. అలా పేడలో ముత్యాల్ని వెతకాలా.. అంటూ ఇంటి సభ్యులు ముక్కులు మూసుకున్నారు. కానీ స్ట్రాటజీస్ బ్రాండ్ అంబాసిడర్ అయిన కాజల్ మాత్రం పేడ వాసన అంటే తనకు మహా ఇష్టం అంటూ తెగ పీలుస్తూ.. ఓవర్ చేసింది. ఫస్ట్ లోబో, షణ్ముఖ్ లు పేడలో దొరికిన ముత్యాల్ని వాటర్ లో కడిగి ఓ బౌల్ లో వేయాలి. అలాగే లోబో పేడలో ముత్యాల్ని కడిగి పక్కన పెట్టారు. ఈయన ముత్యాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. షణ్ను ముత్యాలు కడిగాడు గానీ, శుభ్రంగా లేవు.
దీంతో సంచాలకునిగా ఉన్న సన్నీ కాసేపు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో విశ్వ, శ్రీరామ్, రవిలు షణ్ముఖ్ ముత్యాలు శుభ్రంగా లేవని అంటారు. దీంతో సిరి మాట్లాడుతూ శుభ్రంగా ఉండటం మెయిన్ పాయింట్ కాదు, ఎవరు ఎక్కువ తీస్తారనేది ఇంపార్టెంట్ అంటూ షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తుంది. ఫైనల్ గా విన్నర్ షణ్ముఖ్ అని సన్నీ అనౌన్స్ చేస్తారు. వెంటనే షణ్ముఖ్ ని సిరి హగ్ చేసుకుంటుంది. ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లో 50 రోజులు పూర్తయిన తర్వాత షణ్ముఖ్ గేమ్ ఆడుతున్నాడంటే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ గేమ్ ని షణ్ముఖ్ ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…