Bigg Boss 5 : బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. కారణం అదే!

November 14, 2021 12:16 PM

Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం 10వ వారం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే శనివారం నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడుతూ సన్నీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన గొడవ కారణంగా నాగార్జున సన్నీని మందలించాడు. అయితే సన్నీ షణ్ముఖ్ ను ఉద్దేశించి కేవలం యూట్యూబ్ వరకు మాత్రమే అంటూ అనడం తప్పు.. ఇలా సన్నీ అన్న మాటలకు నాగార్జున సన్నీని వీడియో చూపించి మందలించారు.

Bigg Boss 5 netizen angry on nagarjuna for showing partiality

సన్నీ అలా మాట్లాడాడు అంటే అవతలి వాళ్లు కూడా తప్పుడు మాటలు మాట్లాడి ఉంటారు. అయితే నాగార్జున మాత్రం ఒక హోస్ట్ గా వ్యవహరించకుండా ఒకరి వైపే మాట్లాడటంతో నెటిజన్లు దారుణంగా నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. హోస్ట్ అంటే ఎవరు తప్పు చేసినా హౌస్ లో వారిని ఇది తప్పు అని చెబుతూ వారికి వార్నింగ్ ఇవ్వాలి.

అయితే నాగార్జున మాత్రం అలా చేయకుండా కేవలం సన్నీని మాత్రమే టార్గెట్ చేస్తూ తిట్టడంతో నాగార్జున కంటెస్టెంట్ లపై పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు.. అని నెటిజన్స్ ఏకిపారేశారు.

గత ఎపిసోడ్ లో భాగంగా సిరి, షణ్ముఖ్ కూడా కొన్ని తప్పుడు మాటలు మాట్లాడినా వారిని ఏమీ అనకుండా కేవలం సన్నీని మాత్రమే తిట్టడంతో సన్నీ అభిమానులు బిగ్ బాస్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం బిగ్ బాస్ నిర్వాహకుల స్క్రిప్టు ప్రకారమే జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now