Bigg Boss 5 : 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమం తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిది మంది కంటెస్టెంట్ లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే తొమ్మిదో వారం హౌస్ నుంచి ఎవరూ ఊహించని విధంగా కండలవీరుడు విశ్వ ఎలిమినేట్ కావడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. విశ్వ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త తెలియగానే ఇటు అభిమానులు, అటు హౌస్ సభ్యులు ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ విషయంపై నట రాజ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నట రాజ్ మాస్టర్ నాలుగో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇతను హౌస్ లో ఉన్నన్ని రోజులూ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ అందించినప్పటికీ చివరిలో హౌస్‌లో ఉన్న సభ్యులను జంతువులతో పోలుస్తూ ఎంతో విసుగు పుట్టించాడు. ఈక్రమంలోనే నట రాజ్ మాస్టర్ 4వ వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
ఇక తొమ్మిదవ వారం విశ్వ హౌస్ నుంచి రాగానే ఇన్ని రోజులకు నీ పాపం పండింది. అందుకే ఊసరవెల్లి హౌస్ నుంచి బయటకు వచ్చింది అంటూ కామెంట్ చేశాడు. దీంతో నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ మాస్టర్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి నీ పాపాలు నాలుగో వారానికే పండాయా.. అందుకే 4వ వారంలోనే ఎలిమినేట్ అయ్యావా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నువ్వు విశ్వ ఆడిన ఆటలో సగం కూడా ఆడలేదు.. పైగా ఇప్పుడు ఫోజులు కొడుతున్నావు.. నీ సోది వెళ్లి జంతువులకు చెప్పుకో.. పో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…