గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : విశ్వ ఎలిమినేషన్ పై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!

Bigg Boss 5 : 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమం తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిది మంది కంటెస్టెంట్ లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే తొమ్మిదో…

Bigg Boss 5 : విశ్వ ఎలిమినేషన్ పై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!

Bigg Boss 5 : 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమం తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిది మంది కంటెస్టెంట్ లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే తొమ్మిదో వారం హౌస్ నుంచి ఎవరూ ఊహించని విధంగా కండలవీరుడు విశ్వ ఎలిమినేట్ కావడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. విశ్వ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త తెలియగానే ఇటు అభిమానులు, అటు హౌస్ సభ్యులు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss 5 natraj master comments on vishwa elimination

ఇక ఈ విషయంపై నట రాజ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నట రాజ్ మాస్టర్ నాలుగో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇతను హౌస్ లో ఉన్నన్ని రోజులూ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ అందించినప్పటికీ చివరిలో హౌస్‌లో ఉన్న సభ్యులను జంతువులతో పోలుస్తూ ఎంతో విసుగు పుట్టించాడు. ఈక్రమంలోనే నట రాజ్ మాస్టర్ 4వ వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

ఇక తొమ్మిదవ వారం విశ్వ హౌస్ నుంచి రాగానే ఇన్ని రోజులకు నీ పాపం పండింది. అందుకే ఊసరవెల్లి హౌస్ నుంచి బయటకు వచ్చింది అంటూ కామెంట్ చేశాడు. దీంతో నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ మాస్టర్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి నీ పాపాలు నాలుగో వారానికే పండాయా.. అందుకే 4వ వారంలోనే ఎలిమినేట్ అయ్యావా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నువ్వు విశ్వ ఆడిన ఆటలో సగం కూడా ఆడలేదు.. పైగా ఇప్పుడు ఫోజులు కొడుతున్నావు.. నీ సోది వెళ్లి జంతువులకు చెప్పుకో.. పో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి