Bigg Boss 5 : సిరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. అందరికీ చెప్పి, నువ్వు చేస్తున్నదేంటి అంటూ..!

October 10, 2021 3:16 PM

Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం 5వ వారం కూడా పూర్తి కావస్తోంది. ఈ క్రమంలోనే ప్రతివారం మాదిరిగానే శని, ఆదివారాలలో నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడుతూ వారం రోజులలో వారు చేసిన తప్పుల గురించి కంటెస్టెంట్ లకు గట్టిగా క్లాస్ పీకుతున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ శనివారం కూడా నాగార్జున హౌస్‌ సభ్యులతో మాట్లాడి వారు చేసిన తప్పుల గురించి కంటెస్టెంట్ లకు వార్నింగ్ ఇచ్చారు.

Bigg Boss 5 nagarjuna given warning to siri

ఇకపోతే హౌస్ లో ఉన్న 15 మంది కంటెస్టెంట్ లలో సిరి, జెస్సి, షన్ను ముగ్గురు ఒక టీంగా గేమ్ ఆడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున రావడంతోనే అందరి తప్పులను బయటపెట్టడంతోపాటు కంటెస్టెంట్ సిరితో మాట్లాడుతూ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

సిరి అంటూ ..సిరి గురించి మాట్లాడుతూ.. నువ్వు ఎప్పుడూ ఒకరి వెనకాల మాట్లాడకూడదు.. అంటూ నీతులు చెబుతూ.. నువ్వు చేస్తున్న పని ఏంటి.. అని నాగార్జున ప్రశ్నించడంతో నీళ్లు నమిలిన సిరి.. మా ముగ్గురికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వారితో అలా మాట్లాడాను సార్ అని చెప్పే ప్రయత్నం చేసింది. అదేవిధంగా కెప్టెన్ గా శ్రీరామ్ సేవలను ప్రశంసించారు. ఇక సన్నీ రాజ్యానికి ఒక్కడే రాజ్యం అనే టాస్క్ లో ఓడిపోవడంతో బాధపడకు అని సన్నీతో మాట్లాడారు. శనివారం కార్యక్రమంలో భాగంగా కొండ పొలం టీం బిగ్ బాస్ వేదికపై సందడి చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now