Bigg Boss 5 : ప్రియాంక సింగ్ అంటే ఇష్టం.. తనకు ఇష్టమైతే పెళ్ళి చేస్తా: మానస్ తల్లి

November 8, 2021 11:33 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు, గొడవలతోపాటు లవ్ స్టోరీలు కూడా కామనే. అలాగే ఈ సీజన్ లో ట్రాన్స్ జెండర్ అయిన ప్రియాంక, మానస్ ను ఇష్టపడుతుందనే విషయం తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యింది. అర్థరాత్రి పూట హౌస్ లో మానస్ దగ్గర కూర్చుని.. దేవుడు నాకు మంచి జీవితం ఇచ్చి ఉంటే బాగుండేది కదా.. నీతో హ్యాపీగా ఉండేదాన్ని.. అంటూ బాధపడింది. రోజులు గడుస్తున్న కొద్దీ.. ప్రియాంక.. మానస్ పై ఆశలు పెంచుకుంటోంది. ప్రతి రోజూ అతని గురించే ఆలోచిస్తోంది. ఆమె పరిస్థితికి ఆ తర్వాత ఆమె ఏమైపోతుందోనని ప్రేక్షకులు కూడా కంగారు పడుతున్నారు.

Bigg Boss 5 manas mother about priyanka singh marriage

ఈ క్రమంలో మీడియాకి మానస్ తల్లి పద్మిని ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో మానస్, ప్రియాంకల రిలేషన్ షిప్ పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక చాలా మంచి అమ్మాయి.. తనకెంతో ఇష్టమని పద్మిని అన్నారు. అయితే ఓ సారి ప్రియాంక.. మానస్ ని హజ్బెండ్ మెటీరియల్ అన్నప్పుడు.. మానస్ ఆమెను కేవలం మరదలు అని మాత్రమే అన్నారని అంటుంది. అలాగే బిగ్ బాస్ అనేది కేవలం 100 రోజుల ఆట. ఈ రియాలిటీ షోలో ఎంతమంది జంటలుగా మారారు ? ఎంతమంది నిజ జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారనేది పక్కన పెడితే.. అది బిగ్ బాస్ వరకు మాత్రమే పరిమితం అవుతుందని అంటున్నారు.

ఆ విషయం చూస్తున్న ప్రజలతోపాటు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కి కూడా తెలుసు. కాకపోతే హౌస్ లో ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ కామన్ అని అన్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారు మానస్ కు ఎవరూ సెట్ కారని, తాను ఎవర్ని చూపిస్తే మానస్ వాళ్ళనే పెళ్ళి చేసుకుంటాడని తెలిపారు. అంతేగానీ.. ప్రియాంక.. మానస్ ను పెళ్ళి చేసుకుంటానంటే మాత్రం తాను ఒప్పుకోనని అన్నారు. తనకు తగిన అబ్బాయితో ప్రియాంక పెళ్ళి చేస్తానని మానస్ తల్లి పద్మిని అన్నారు. అలా ప్రియాంకకు సపోర్ట్ చేస్తానని అన్నారు.

అలాగే మానస్ ఫస్ట్ లవ్ గురించి తెలిపారు. చదువుకునే రోజుల్లోనే మానస్ ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. దీంతో ఏం చేయాలని తనను అడిగినప్పుడు, నీదింకా చిన్న వయసని, కరెక్ట్ గా సెటిల్ అవ్వకుండా అమెరికా వెళ్ళడం కరెక్ట్ కాదని సలహా ఇచ్చారట. అలా తన మాటకు గౌరవం ఇచ్చి కెరీర్ పై ఫోకస్ చేశాడని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now