Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ మంది మహిళా కంటెస్టెంట్స్ బయటకు రాగా, హౌజ్‌లో ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు. గత వారం నామినేషన్‌లో ప్రియ, అనీ మాస్టర్, లోబో, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉండగా.. ప్రియ ఎలిమినేట్ అయింది. అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయిందని కార్యక్రమ వ్యాఖ్యాత, నటుడు నాగార్జున తెలిపారు.
బంగారు కోడిపెట్ట టాస్క్‌లో ప్రియ ప్రవర్తనే ఆమె కొంపముంచింది. సన్నీతో ప్రతి సారి గొడవ పడడం సాధారణంగానే అనిపించినా.. తాజా ఎపిసోడ్లో మాత్రం ప్రియ శృతి మించి ప్రవర్తించింది. దీంతో ప్రేక్షకులకు విసుగు కలిగిలా చేసింది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేశారు. అయితే ప్రియ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నటికి ఒక్క వారానికే రూ.1.50 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ప్రియ ఏడు వారాలకు రూ.10 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది.
సినిమా పరిశ్రమలో, సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్‌కి ఉన్న క్రేజ్ ఆధారంగా నిర్వాహకులు రేట్ ఫిక్స్ చేశారు. ప్రియ ఎప్పటి నుండో సినిమాలు చేస్తుంది. అలాగే ఇప్పుడు సీరియల్స్ కూడా చేస్తుంది. దీంతో ఆమెకు బాగానే పాపులారిటీ ఉంది. ఈ క్రమంలోనే ప్రియకు బాగానే ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…