Bigg Boss 5 : సిరి, ప్రియాంకతో రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిన జెస్సీ.. ముద్దులు పెట్టొచ్చు కదా అంటూ..!

November 4, 2021 11:33 AM

Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే తొమ్మిది వారాలు పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు నామినేషన్, ఇతర టాస్క్ లలో వారి నిజస్వరూపాలు బయటపెట్టినా.. మిగతా సమయాలలో మాత్రం ఎంతో చనువుగా ఉంటూ సరదాగా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా జెస్సి.. ప్రియాంక, సిరితో రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయారు.

Bigg Boss 5  jessy romantic mood with siri and priyanka

తాజా ఎపిసోడ్ లో భాగంగా జెస్సీ ఒకవైపు సిరి, మరొకవైపు ప్రియాంకతో రొమాన్స్ చేశారు. జెస్సీ పక్కన సిరి పడుకొని ఉండగా ఆ సమయంలో ప్రియాంక వారి దగ్గరకు రావడంతో జెస్సి వీరిద్దరితో రొమాన్స్ చేశారు. ఈ సమయంలోనే పింకీ జెస్సీని ఉద్దేశిస్తూ నువ్వు చాలా రొమాంటిక్ పర్సన్ అంటూ అతనిపై కామెంట్లు చేసింది.

సిరి, ప్రియాంక పక్కపక్కనే కూర్చోవడంతో ఇంతకన్నా నాకు బెస్ట్ టైం రాదని, నా రెండు బుగ్గలు ఖాళీగా ఉన్నాయి ముద్దు పెట్టొచ్చు కదా అంటూ జెస్సి ఎంతో ఓపెన్ గా వారిని అడిగారు. ఆ మాట విన్న సిరి జెస్సి పై సెటైర్ వేయగా ప్రియాంక మాత్రం తన గడ్డం నిమురుతూ అతనితో సరసాలు ఆడింది. ఇక ఈ సన్నివేశం తాజా ఎపిసోడ్ లో హైలెట్ కాగా ఇది చూసిన పలువురు నెటిజన్లు కెమెరాలు ఉన్నాయన్న భయం కూడా లేకుండా ఏంటి ఈ సరసాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now