Bigg Boss 5 : బిగ్ బాస్ హోస్ట్ శృతి హాస‌న్ కాదు, ర‌మ్య‌కృష్ణ‌..!

November 27, 2021 9:30 AM

Bigg Boss 5 : అన్ని ప్రాంతీయ భాష‌ల‌లోనూ స‌క్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోకి ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంలో దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సీజ‌న్ 5 జ‌రుపుకుంటోంది. త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న ఇప్పుడు బిగ్‌బాస్ ను హోస్ట్ చేయ‌లేని ప‌రిస్థితి. దీంతో నిర్వాహ‌కులు ఓ ప్లాన్ చేసి క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్‌ని రంగంలోకి దింపుతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

Bigg Boss 5 host is ramya krishna not shruti haasan

కానీ కోలీవుడ్ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు త‌మిళ బిగ్‌బాస్‌ను శ్రుతిహాస‌న్ హోస్ట్ చేయ‌డం లేద‌ట‌. సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ త‌మిళంలో హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. బాహుబలితో మరోసారి ఆమెకు ఆమే సాటి అనిపించుకున్న ఎవర్ గ్రీన్ రమ్యకృష్ణ హోస్ట్‌గా రాబోతున్నారు. కమల్‌తో ఆమె ‘పంచతంత్రం’ సినిమా చేశారు. ఇప్పుడు కమల్‌కి బదులు ‘బిగ్ బాస్’ సీజన్ 5 కి హోస్టింగ్ చెయ్యబోతున్నారు. క‌మల్ వ‌చ్చే వ‌ర‌కు ఆ బాధ్య‌త‌ల‌ను ర‌మ్య‌కృష్ణ‌నే మోయ‌నున్నార‌ట‌.

తెలుగులో ర‌మ్య‌కృష్ణ‌కు బిగ్ బాస్ కార్య‌క్ర‌మం హోస్ట్ చేసిన అనుభ‌వం ఉంది. నాగార్జున తన 60వ బర్త్ డే సందర్భంగా విహార యాత్ర కోసం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో హోస్ట్‌గా రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేశారు. రెండు రోజులపాటు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇంటి సభ్యుల తీరును రమ్యకృష్ణ ఘాటుగా ప్రశ్నిస్తూ తన హుందాతనాన్ని చాటుకొన్నారు. ఇప్పుడు కూడా ఆమె అల‌రించ‌డం ఖాయం.. అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now