Bigg Boss 5 : ఎలిమినేటెడ్‌ కంటెస్టెంట్స్.. గెట్ టుగెదర్..

November 2, 2021 11:52 AM

Bigg Boss 5 : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభం అయ్యి 8 వారాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రతివారం హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ ఇప్పటికీ ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే 8వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్స్ లోబో బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా గత ఏడు వారాలుగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.

Bigg Boss 5 eliminated contestants get together

ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు అందరూ కలసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి సరియు, ఉమాదేవి, శ్వేతా వర్మ, నటరాజ్ మాస్టర్, హమీద, లహరి, ప్రియా, లోబో ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్, లహరి, హమీద, ప్రియా, ఉమాదేవి వీరందరూ కలిసి నటరాజ్ మాస్టర్ ఇంటిలో కలుసుకున్నారు.

నటరాజు మాస్టర్ భార్య నీతూతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో 11 మంది కంటెస్టెంట్ లు ఉండగా ఈ వారం కెప్టెన్ షణ్ముఖ్, అనీ మాస్టర్‌ తప్ప మిగిలిన కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ టైటిల్ రేసులో షణ్ముఖ్ జస్వంత్, సన్నీ ఉండబోతున్నారని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now