Bigg Boss 5 : సీజ‌న్ 5 కంటెస్టెంట్స్‌ని త‌న సినిమాలోకి తీసుకున్న రామ్ చ‌ర‌ణ్‌..!

November 16, 2021 1:40 PM

Bigg Boss 5 : శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌లుగా మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఇటీవ‌లే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. పూనే, స‌తారా, పాల్‌ట‌న్ ప్రాంతాల్లో స్పెష‌ల్ సీక్వెన్స్‌ల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించారు. రామ్ చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ భారీ రేంజ్‌లో ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు.

Bigg Boss 5 contestants got lucky chance to act in ram charan movie

ఈ సినిమా కోసం భారీ ఫైట్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారని, అయితే అందులో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. 7 నిమిషాల పాటు సాగే ఈ ఒక్క ఫైట్ కోసం దాదాపుగా రూ.70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఏ సినిమాలోనూ చూడని రేంజ్‌లో ఈ ఫైట్ సీన్ ఉంటుందని తెలుస్తుండడం మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది.

ఈ సినిమాకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆనందింపజేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త అభిమానుల‌ని ఆనందింప‌జేస్తోంది. బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో పాల్గొని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసిన లోబో, విశ్వ లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నార‌ట‌. ఈ ఇద్ద‌రూ రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ కు ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. మిగతా భాషల్లోనూ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా.. లేకుంటే వేరే ఏదైనా టైటిల్ పెడతారా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now