Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 60 రోజులు పూర్తయ్యాయి. హౌజ్‌లో 11 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు ట్రోఫీ అందుకుంటారో అని లెక్కలు మొదలు పెట్టేశారు. అయితే ప్రస్తుతం హౌజ్‌లో ఇంటి సభ్యులు ఎప్పుడు ఎలా ఉంటున్నారు, ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు.. అనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో హీరోస్ టీం విలన్ టీంకి సంబంధించిన రవిని టార్గెట్ చేయడం, ఆయనకు వెన్ను నొప్పి అని తెలిసినా కూడా టార్చర్ పెట్టడం ఆయన అభిమానులకి బాధని కలిగించింది.
మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అషూ రెడ్డి కూడా ఫైర్ అయింది. రవికి వెన్ను నొప్పి అని తెలిసి కూడా వాళ్లు అతడిని టార్గెట్ చేస్తున్నారు. అది అక్కడ క్లియర్‌గా కనిపిస్తోంది. దీన్ని టార్చర్ అంటారు, కానీ గేమ్ అనరు’ అని మండిపడింది. ఆమెను పలువురు సపోర్ట్ చేస్తున్నారు.
టాస్క్‌లో భాగంగా రవికి మిక్స్‌డ్ జ్యూస్‌ను తాగాలని చెప్పగా రవి గుటగుటా తాగేశాడు. డ్రింక్ తాగిన వెంటనే స్క్వాడ్స్ చేయమన్నారు. రవికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది, కాబట్టి ఆ టాస్క్ చేయనని చేతులెత్తేస్తాడనుకున్నారు, కానీ రవి వెనకడుగు వేయలేదు. దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత మరో రకం జ్యూస్ తాగించి గుండ్రంగా తిప్పించారు. ఆయనతో క్విట్ చేయించాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ఎట్టకేలకు ఈ టాస్క్‌లో రవి విజయం సాధించాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…