Bigg Boss 5 : కెప్టెన్సీ టాస్క్ లో విశ్వరూపం చూపించిన అనీ మాస్టర్.. కోపం ప‌ట్ట‌లేక కొరికేసింది కూడా..!

October 29, 2021 10:10 AM

Bigg Boss 5 : బుల్లితెర బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ కెప్టెన్సీ టాస్క్ లో పోటీదారులుగా ఎన్నికైన వారు సన్నీ, మానస్, సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, శ్రీరామ్ లు పోటీపడ్డారు. ఈ పోటీలో భాగంగా వెంటాడు వేటాడు అనే టాస్క్ లో థర్మోకోల్ బ్యాగ్స్ ని భుజాన వేసుకుని కంటెస్టెంట్స్ సర్కిల్ గీసిన ట్రాక్ పైనే నడుస్తూ ఉండాలి. ఈ క్రమంలో ఎవరి దగ్గరైతే గేమ్ ఫినిష్ అయ్యే వరకు థర్మోకోల్ బ్యాగ్ ఉంటుందో వాళ్ళే గెలిచినట్లని బిగ్ బాస్ చెబుతాడు.

Bigg Boss 5 ani master fire in captaincy task

ఈ టాస్క్ కి సంచాలకుడిగా జెస్సీ ఉంటారు. ఫస్ట్ శ్రీరామ్, సన్నీలు పోటీపడ్డారు. ఒకర్ని ఒకరు తోసుకుంటూ శ్రీరామ్, సన్నీ ఇద్దరూ కింద పడతారు. సన్నీ అవుట్ అంటూ అనౌన్స్ చేస్తాడు. సన్నీ తన ఫ్రెండ్ కోసం అవుట్ అయ్యాడని శ్రీరామచంద్ర కౌంటర్ వేసి మరీ రెచ్చగొడతాడు. ప్రియగారు కరెక్ట్ ఆడారంటూ మరింత ఎక్కువగా సన్నీని రెచ్చగొడతారు. ఈ టాస్క్ లో సన్నీ అవుట్ అయినందుకు శ్రీరామ్, సన్నీలకు మధ్య మాటలతోనే యుద్దాన్ని ప్రకటించారు. శ్రీరామ్ పదే పదే సన్నీని నువ్వు ఇండిపెండెంట్ ప్లేయర్ కాదని, అందుకే ఓడిపోయావని, అందుకే బయట ఉన్నావంటాడు. నెక్ట్స్ రౌండ్ లో శ్రీరామ్, మానస్ ని కిందకి తోసేస్తాడు.

వారిద్దరూ అవుట్ అని జెస్సీ అంటూ సన్నీ, మానస్ ఔట్ కాదని ఫైర్ అవుతాడు. నెక్ట్స్ రౌండ్ లో సిరి, అనీ మాస్టర్, షణ్ముఖ్ లు గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇక సిరి, షణ్నులు కలిసి అనీ మాస్టర్ ని టార్గెట్ చేయడంతో.. అనీ మాస్టర్ ఇక్కడ కంటెస్టెంట్స్ లో నిజాయితీ లేదని, సిరిని నెట్టేస్తుంది. దీంతో అనీ మాస్టర్ తనను కొరికేసిందని కత్తి పట్టుకుంటుంది. ఇది తప్పని సిరిని, హౌస్ మేట్స్ ఆపుతారు. ఇక గ్రూపులుగా ఆడుతున్నారు. అలాంటప్పుడు ఇండిపెండెంట్ గా ఆడి కెప్టెన్ అవ్వాలంటే ఎలా కుదురుతుందని అనీ మాస్టర్ ఫైర్ అవుతుంది. అలా తనంతట తానే థర్మోకోల్ బ్యాగ్ ని చింపేసి, గేమ్ నుండి బయటకు వచ్చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment